1. ఇతరాలు
  2. »
  3. ఆరోగ్యం
  4. »
  5. చిట్కాలు
  6. Women

Man | Women | Hairs | Protiens | Food | Vitamins | Iron | Spinach | Fruits | Amla | వెంట్రుకలు రాలిపోతున్నాయే...!!

పురుషులు
చాలామంది పురుషులు, మహిళల్లో వెంట్రుకలు రాలిపోవడం పెద్ద సమస్యగా తయారవుతోంది. దీనికి ప్రధాన కారణం...సరైన పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోకపోవడమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి పైగా మానసికపరమైన ఒత్తిడి, దీర్ఘకాలంపాటు జబ్బులతో సతమతమవ్వడం, నిద్రలేమి, తలను శుభ్రంగా ఉంచుకోకపోవడం, వంశపారంపర్యం తదితర కారణాలుంటాయని వైద్యులు చెపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వెంట్రుకలు రాలిపోకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి...

* పాలాకును ఆహారంగా తీసుకుంటుంటే వెంట్రుకలు రాలడాన్ని పూర్తిగా నివారించవచ్చంటున్నారు వైద్యులు. ఇందులో శరీరానికి కావలసని ఇనుము (ఐరన్) పుష్కలంగా ఉంది. వెంట్రుకల రాలకుండా ఉండేందుకు శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటే వెంట్రుకలు రాలకుండా ఉంటుంది.

* పోషకపదార్థాలు కలిగిన పండ్లు, కూరగాయలు, డైరీ ఉత్పత్తులు తీసుకోవాలి.

* తలను శుభ్రంగా ఉంచేందుకు వారానికి కనీసం రెండుసార్లయినా తలస్నానం చేయాలి.

* వెంట్రుకలు పెరిగేందుకు ఉసిరికాయ ఎంతో తోడ్పడుతుంది. ఉసిరికాయలను ముక్కలుగా చేసుకుని ఎండబెట్టండి. ఎండిన ఉసిరి ముక్కలను కొబ్బరి నూనెలో మరిగించండి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు తలకు దట్టించండి. దీంతో వెంట్రుకలు రాలడం తగ్గడంతోపాటు వెంట్రులకుల పెరుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* ప్రతి రోజు 8-10 గ్లాసుల నీటిని సేవించండి.

* తలకు షాంపూ వాడేలాగుంటే వారానికి రెండుసార్లు మాత్రమే షాంపూను ఉపయోగించండి.