Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మధుమేహ వ్యాధిగ్రస్థులు చలికాలంలో కందగడ్డను తింటే?

గురువారం, 28 డిశెంబరు 2017 (11:48 IST)

Widgets Magazine

చలికాలంలో జొన్నలు తినడం ద్వారా శరీరానికి పుష్కలమైన క్యాల్షియం లభిస్తుంది. దీనివల్ల కండరాలు బిగుసుపోకుండా ఉంటాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా మాయమవుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ చలికాలంలో జొన్నతో చేసిన రొట్టె, జొన్నలతో చేసిన సంకటి తీసుకుంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకున్నట్లేనని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే చలికాలంలో ఏర్పడే జలుబు, దగ్గును దూరం చేసుకోవాలంటే.. దానిమ్మను చలికాలంలో తినాలి. దానిమ్మ ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా దానిమ్మ రక్షణనిస్తుంది. చలికాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ వ్యాధుల నివారణలో కూడా దానిమ్మ అద్భుతంగా పనిచేస్తుంది. చలికాలంలో వెచ్చదనం కోసం నువ్వులు తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత సక్రమంగా వుంటుంది. ఇంకా నువ్వుల్లో వుండే ఐరన్, క్యాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి.
 
చలికాలంలో మధుమేహ వ్యాధిగ్రస్థులు కంద గడ్డలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూర్చినవారవుతారు. కందగడ్డల్లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మధుమేహం ఉన్నవారు వీటిని తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా చలికాలంలో వారానికి రెండుసార్లు పాలకూర తీసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. చలికాలపు వ్యాధులను నివారించడంలో ఇది చక్కగా పనిచేస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండి.. రక్తం పెరగడానికి దోహద పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

సూపర్ మార్కెట్లలో ప్రాసెస్డ్ మాంసం కొంటున్నారా?

చికెన్, మటన్, రొయ్యలు, చేపలు ప్రాసెస్ చేసినవి కొంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి అంటున్నారు.. ...

news

వీటిని ఆరగిస్తే గుండెపోటు దూరం

మంచి ఆరోగ్యం లేకుంటే పరిపూర్ణమైన సంతోషం ఉండదు. అందుకే ప్రతి మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉండాలని ...

news

ఖర్జూరాలను రోజూ తింటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయట...

ఖర్జూరాలను రోజు రెండేసి తీసుకుంటే బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ...

news

వెల్లుల్లిని పాలలో మరిగించి తీసుకుంటే ఆ.. ఇన్ఫెక్షన్లు మటాష్

వెల్లుల్లిని పాలలో మరిగించి తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చునని.. నిద్రలేమి సమస్యను దూరం ...

Widgets Magazine