Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మునగాకును వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చితే?

సోమవారం, 13 నవంబరు 2017 (12:20 IST)

Widgets Magazine
drumstick leaves

మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మధుమేహాన్ని దూరం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు మునగాకును వారంలో రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని విటమిన్ సి ఎముకలను బలపరుస్తుంది.

ఇందులో విటమిన్ ఎ, సిలే కాకుండా క్యాల్షియం, ఐరన్ ఫాస్పరస్ ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆకును పచ్చడి లేదా కూర చేసుకుని తింటే ఆరోగ్యానికి శక్తి లభిస్తుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాంటి మునగాకుతో పచ్చడి చేసుకుని తింటే.. వర్షాకాలంలో ఏర్పడే జలుబు, జ్వరం దూరమవుతుంది. 
 
మునగాకు పచ్చడి ఎలా చేయాలంటే.. ఒక పాన్‌లో కొంచెం నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేగాక ప్లేటులోకి తీసుకుని పక్కనబెట్టుకోవాలి. ఆ తరువాత రెండు కప్పుల మునగాకు అదే పాన్‌లో కొంచెం నూనె వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
 
ఇప్పుడు మిక్సీ జార్‌లో ముందు వేంపిన దినుసులన్నీ వేసి మిక్సి పట్టి ఆ తరువాత మునగాకు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని.. మరో పాన్‌లో కొంచెం నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి వేసి తాలింపు పెట్టి రబ్బుకున్న పచ్చడి అందులో వేసి కలిపి దించేయాలి. అంతే మునగాకు పచ్చడి రెడీ అయినట్లే. మునగాకును  ఇలా పచ్చడిగా లేకుంటే తాలింపుగా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రోజూ స్పూన్ తేనెలో చిటికెడు కుంకుమ పువ్వు కలుపుకుని?

ఆరోగ్యం కోసం.. ఈ చిట్కాలు పాటించండి. గ్లాసు నీటిలో తులసి, వేపాకులు, మిరియాలు వేసి ...

news

ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరాన్నితాకితే...

చాలామంది ఉదయాన్నే నిద్రలేవడం ఎంతో కష్టంగా భావిస్తుంటారు. రాత్రిసమయంలో ఎంత ఆలస్యంగానైనా ...

news

అశ్వగంధ టీని పిల్లలకు ఇస్తే?

అశ్వగంధ పొడితో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరానికి శక్తి చేకూరుతుంది. లైంగిక ...

news

తేనెలో కాస్త గ్లిజరిన్‌ కలిపి రాసుకుంటే...

సాధారణంగా చలికాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు ...

Widgets Magazine