లైంగిక వ్యాధులతో జననేంద్రియాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు ఏమిటి?

జననాంగాలు, పునరుత్పత్తి అంగాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్‌కు జననేంద్రియ వ్యాధి అని పేరు. ఈ వ్యాధులు పురుషులకన్నా స్త్రీలలో మూడు రకాలుగా రావచ్చు. లైంగిక పరంగా కూడా కొన్ని వ్యాధులు సోకవచ్చు. మొత్తమ్మీద జననాంగాలకు వచ్చే వ్యాధులు ఎలా వ్యాపిస్తాయంటే... * జననాంగా

couple
ivr| Last Modified శనివారం, 11 నవంబరు 2017 (20:58 IST)
జననాంగాలు, పునరుత్పత్తి అంగాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్‌కు జననేంద్రియ వ్యాధి అని పేరు. ఈ వ్యాధులు పురుషులకన్నా స్త్రీలలో మూడు రకాలుగా రావచ్చు. లైంగిక పరంగా కూడా కొన్ని వ్యాధులు సోకవచ్చు. మొత్తమ్మీద జననాంగాలకు వచ్చే వ్యాధులు ఎలా వ్యాపిస్తాయంటే...
* జననాంగాల విషయంలో పరిశుభ్రతను పాటించనపుడు.
* రొటీన్ చెకప్‌లలో, ఆపరేషన్లలో స్టెరిలైజ్ చేయని పరికరాల్ని వాడినపుడు.
* రక్షణ జాగ్రత్తలు పాటించకుండా సెక్స్‌లో పాల్గొన్నప్పుడు.

లైంగిక వ్యాధులు
ఎస్.టి.ఐ ఇన్‌ఫెక్షన్ సెక్స్ ద్వారా దాదాపుగా రావచ్చు. సాధారణంగా జననాంగాల దగ్గర ఈ ఇన్‌ఫెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఓ విషయం గమనించాలి... ఆర్.టి.ఐ అనేది ఎస్.టి.ఐ ఇన్‌ఫెక్షన్‌లో భాగం కావచ్చు కానీ... ఆర్.టి.ఐ ఇన్‌ఫెక్షన్లన్నీ ఎస్.టి.ఐ ఇన్‌ఫెక్షన్లు కావు.

పురుషుల్లో కనిపించే ఇన్‌ఫెక్షన్ లక్షణాలు
* మూత్రం పసుపు లేదా ఆకుపచ్చరంగులో ఉండటం
* పురుషాంగంపై కురుపు లాంటిది ఉండటం, కురుపు నొప్పి కలిగి ఉండవచ్చు లేదా ఎలాంటి నొప్పి లేకుండా ఉండవచ్చు.

స్త్రీలలో ఇన్‌ఫెక్షన్ లక్షణాలు
* యోని ద్వారం ద్వారా వచ్చే స్రావాలు దుర్వాసనతో ఉండటం
* పీరియడ్‌తో సంబంధం లేకుండా బ్లీడింగ్ కావడం.

స్త్రీ, పురుషుల్లో కనిపించే సాధారణ లక్షణాలు
* మూత్రంలో ఎక్కువ మంట, ఎక్కువ సార్లు మూత్రానికి పోవాల్సి రావటం.
* గుల్లలు, దురద, కురుపుల్లాంటివి జననాంగాల దగ్గర ఏర్పడటం.
* తొడ భాగంలో వాపు, నొప్పి ఉండటం, దురద లేకుండా శరీరంలో ఎక్కడైనా చర్మం ఎర్రబడటం. దద్దుర్లు లాంటివి రావటం.
* యోని భాగంలో చిన్న గుల్ల ఏర్పడటం, నోటిలో పుండ్లు, పూత, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరం వచ్చినట్లు అనిపిస్తుండటం, నలతగా ఉండటం.

కనుక ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వైద్యుడ్ని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. సహజంగా సెక్స్ సమస్యలంటే చాలామంది బిడియపడుతుంటారు. కానీ వాటిని ప్రక్కనపెట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే వైద్యం చేయించుకోవాలి.దీనిపై మరింత చదవండి :