Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విమానంలో భార్యాభర్తల గొడవ.. జుట్టు పట్టుకున్నారు.. కానీ వారిని దించేశారు..

మంగళవారం, 7 నవంబరు 2017 (12:16 IST)

Widgets Magazine
russia flight

ఇంట్లోనే కాకుండా విమానంలోనూ భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ల వాడకంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్న వేళ.. భర్త ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్‌ను.. నిద్రపోతున్న భర్త వేలిముద్రలతో అతని ఫోన్ అన్ లాక్ చేసేందుకు ప్రయత్నించిన భార్యకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఇరాన్‌కు చెందిన భార్యాభర్తలు చెన్నై నుంచి విమానంలో బాలీఖతార్ వెళ్తున్నారు. అప్పటికే భర్త తనను మోసగిస్తున్నాడన్న అనుమానంతో వున్న భార్య, అతడి ఫోన్‌ సమాచారం తెలుసుకోవాలని భావించింది. దీంతో నిద్రపోతున్న భర్త వేలిముద్రల సాయంతో అతని స్మార్ట్‌ ఫోన్‌ అన్ లాక్ చేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఊహించని విధంగా అతనికి మెలకువ వచ్చేసింది. అంతే భార్యపై ఫైర్ అయ్యాడు. 
 
ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆమె కూడా అతనితో పోటీపడి వాగ్వాదం చేసింది. అంతే ఈ గొడవ ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. దీంతో విమాన సిబ్బంది వారిద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఆ దంపతులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

అధికారుల ఆదేశాల మేరకు విమానాన్ని చెన్నైకి మళ్లించి, అక్కడ వారిద్దరినీ కిందికి దించేశారు. అనంతరం దంపతులిద్దరూ ఒక అవగాహనకు రావడంతో మరో విమానంలో వారిని  అధికారులు పంపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పరీక్షల ఒత్తిడి.. బిల్డింగ్ ఎక్కి ఉరేసుకున్న విద్యార్థిని.. ఫెయిలయిపోతానని?

పరీక్షల ఒత్తిడికి తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహం హాస్టల్ బయట ...

news

పొలానికి వెళ్ళొస్తుండగా... వివాహితను పాడుబడిన గుడిసెలోకి ఎత్తుకెళ్లి?

మహిళలు ఒంటరిగా తిరగాడని పరిస్థితి ఏర్పడింది. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ...

news

జమ్మూకాశ్మీర్‌లో జైషే మొహమ్మద్ చీఫ్ మేనల్లుడు తల్హా రషీద్ హతం

జమ్మూకాశ్మీర్‌లో భారత సైన్యం మరో అడుగు ముందుకేసింది. కాశ్మీర్‌లో ఉగ్రవాదులను పూర్తిగా ...

news

వైఎస్సార్, చంద్రబాబు తరహాలో జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర సీఎం చేస్తుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ...

Widgets Magazine