బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (10:59 IST)

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

Nikhil
Nikhil
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థి తన మామకు మద్దతుగా టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ గురువారం రోడ్ షో నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి, తన మామ ఎం.ఎం.కొండయ్య నామినేషన్ ర్యాలీలో నిఖిల్ సిద్ధార్థ్ పాల్గొన్నారు. 
 
తన కారులో నిలబడి అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ కొందరితో కరచాలనం చేశాడు. అభిమానుల హర్షధ్వానాల మధ్య వారితో సెల్ఫీలు కూడా దిగాడు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
 
కొండయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని చీరాల ప్రజలకు నిఖిల్ విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యమని నిఖల్ అన్నారు. 
 
నిఖిల్ గత నెలలో టీడీపీ జనరల్ సెక్రటరీ లోకేష్ నాయుడుని కలిశారు. దీంతో ఆయన టీడీపీలో చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే దీనిని ఖండించిన ఆయన.. తన మామకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపేందుకే లోకేష్‌ను కలిశానని స్పష్టం చేశారు.
 
నిఖిల్ చివరిసారిగా గత ఏడాది జూన్‌లో విడుదలైన "గూఢచారి" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. గత నెలలో అతను బాక్సాఫీస్ వద్ద షేక్ చేసిన "కార్తికేయ 2" (2022)కి సీక్వెల్ గా "కార్తికేయ 3"ని ప్రకటించాడు. ప్రస్తుతం "స్వయంభు", "ది ఇండియా హౌస్" చిత్రాల్లో నటిస్తున్నారు.