1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (10:41 IST)

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

renu desai
రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పొలిటికల్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఈ హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరపున మాధవీలత పోటీ చేస్తున్నారు. ఈమెకు ప్రస్తుతం సినీ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మద్దతు ఇచ్చారు. 
 
మాధవీలత ఫొటోను షేర్ చేసిన రేణు... చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమన్‌ని చూశామని చెప్పారు. ఈ పోస్ట్ పెట్టడానికి తాను ఎవరి నుంచి ప్యాకేజ్ తీసుకోలేదని కామెంట్ చేశారు. మాధవీలతపై ఇది తన అభిప్రాయం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. 
 
రేణు చేసిన ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్యాకేజ్ గురించి ఆమె మాట్లాడటంపై కొందరు మండిపడుతున్నారు. పవన్‌ను ఉద్దేశించి ఆమె కామెంట్ చేసిందని ఫ్యాన్స్, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.