Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జమ్మూకాశ్మీర్‌లో జైషే మొహమ్మద్ చీఫ్ మేనల్లుడు తల్హా రషీద్ హతం

మంగళవారం, 7 నవంబరు 2017 (11:12 IST)

Widgets Magazine
kashmir loc

జమ్మూకాశ్మీర్‌లో భారత సైన్యం మరో అడుగు ముందుకేసింది. కాశ్మీర్‌లో ఉగ్రవాదులను పూర్తిగా తుదిముట్టించాలనే లక్ష్యంతో కదులుతున్న భారత సైన్యం.. ఎన్‌కౌంటర్లో జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మేనల్లుడు, తల్హా రషీద్‌ను హతమార్చింది. పుల్వామా జిల్లాలో తలదాచుకున్న రషీద్‌ను జవాన్లు కాల్చి చంపారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య జరిగిన దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాను వీరమరణం పొందగా, మరో ఇద్దరు పౌరులకూ గాయాలయ్యాయి. 
 
జేఈఎంకు స్థానిక కమాండర్‌గా విధులు నిర్వహిస్తూ, యువతను ఉగ్రవాదంవైపు ప్రోత్సహాస్తున్నాడన్న ఆరోపణలతో రషీద్‌పై గతంలోనే కేసులు నమోదయ్యాయి. ఇక రషీద్ మరో ఇద్దరు ఉగ్రవాదులు ముహమ్మద్ భాయ్, వసీమ్‌లతో కలిసి కాండీ అగ్లార్ గ్రామంలో ఉన్నారనే సమాచారం అందుకున్న జవాన్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ తరువాత, ఘటనా స్థలినుంచి ఓ ఏకే 47, ఒక ఎం 16 రైఫిల్, ఓ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. రషీద్‌తో పాటు ముగ్గురు ఉగ్రవాదులు ఈ ఎన్‌కౌంటర్లో హతమైనట్లు సైనిక ఉన్నతాధికారులు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వైఎస్సార్, చంద్రబాబు తరహాలో జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర సీఎం చేస్తుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ...

news

సోషల్ మీడియాలో రేష్మా పటేల్ అశ్లీల ఫోటోలు.. వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్.. ఆమె ఎవరు?

గుజరాత్ బీజేపీ మహిళా నేత రేష్మా పటేల్ అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ...

news

జగన్ పాదయాత్ర అసలు ఉద్దేశ్యం చెప్పినందుకు విజయమ్మకు థ్యాంక్స్...

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర వెనుక అసలు ఉద్దేశం ఏమిటో విజయమ్మ తెలియజేయడం చాలా సంతోషంగా ...

news

తిరుపతిలో గాయని సునీత గానలహరి (వీడియో)

ఈ వేళలో నువ్వు ఏం చేస్తు ఉంటావో.. ఈ పాట వినగానే అందరికీ గుర్తుకు వచ్చే గాయని సునీత. ...

Widgets Magazine