Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గుండెలు పిండేసే ఘటన... కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ కూడా....

బుధవారం, 11 అక్టోబరు 2017 (12:15 IST)

Widgets Magazine
indian  jawan

భారత ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో తీవ్రవాదులతో నిత్యం పోరాడుతూ దేశాన్ని, దేశ ప్రజలను రక్షిస్తున్నారు. అలాంటి జవాన్లు ఉగ్రమూకల తూటాలకు బలవుతున్నారు. అయినప్పటికీ చివరి నిమిషం వరకు ప్రాణాలు ఫణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతున్నారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి.. జరుగుతున్నాయి కూడా. తాజాగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆర్మీ అధికారి చేసిన ఫోన్ వివరాలు ప్రతి ఒక్కరి గుండెలు పిండేస్తున్నాయి. 
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుబేదార్ కుమార్ ఉత్తర కాశ్మీర్‌లోని బడ్గాం జిల్లాలో ఆర్మీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన భార్య దేవి సొంతూరులో ఉంటుంది. కాగా, ఆదివారం కర్వాచౌత్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేవి ఉపవాసంతో పూజలు చేసింది. 
 
మరోవైపు ఆదివారం సాయంత్రం జరిగిన ఉగ్రపోరులో శత్రువు తూటాకి తీవ్రంగా గాయపడిన కుమార్ తన భార్యకు ఫోన్ చేసి... 'నువ్వు ఉపవాసం విడిచి ఏదన్నా తిను. నేను డ్యూటీకి వెళుతున్నాను. ఉదయం మాట్లాడతాను' అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. 
 
ఉగ్రవాదుల కాల్పుల్లో కుమార్ మృతి చెందినట్టు ఉన్నతాధికారులు సోమవారం ఉందయం ఆమెకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ మాటలు విన్న దేవి కుప్పకూలిపోయింది. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చి తేరుకునేలా చేశారు. 
 
కాగా, వీర సుబేదారు కుమార్‌ భౌతికకాయానికి మంగళవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఈ సంఘటనను గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరయ్యింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్ ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామా చేసేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుందని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత ...

news

హనీప్రీత్ సింగ్ చెప్పును కూడా వదల్లేదు.. ఫోటో తీసిన మీడియా.. సెల్ఫీల కోసం..

డేరా బాబా సన్నిహితురాలు, దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ...

news

పూనకం పట్టినట్టు ఊగిపోయిన విమానం.. ఎందుకు (Video)

సాధారణంగా విమానాలు రన్‌వేపై ల్యాండ్ అయ్యే సమయంలో కాస్తంత భయభ్రాంతులకు గురిచేస్తాయి. అదే ...

news

భారత్‌పై అణు బాంబులతో దాడికి సిద్ధమవుతున్న పాకిస్థాన్?

భారత్‌పై అణు బాంబులతో దాడి చేసేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. వివిధ అంశాలపై ...

Widgets Magazine