Widgets Magazine

ఆర్మీలో దళితులు చేరితే.. ఫారిన్ లిక్కర్ తాగొచ్చు.. బాగా తినొచ్చు: కేంద్ర మంత్రి

మంగళవారం, 3 అక్టోబరు 2017 (09:09 IST)

pakistan army

కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే ఆర్మీ ఉద్యోగాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు సైన్యంలో రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా దళిత యువకులు స్థానికంగా లభించే చౌకబారు మద్యం తాగుతున్నారు.. అదే ఆర్మీలో చేరితో.. రమ్ము, మంచి భోజనం లభిస్తాయని అధవాలే కామెంట్స్ చేశారు. అయితే రాందాస్ అథవాలే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
దళితులు దేశరక్షణలో పాలుపంచుకోవాలని, దేశంకోసం ఎటువంటి త్యాగానికైనా దళిత యువకులు ముందుంటారు కనుకే రిజర్వేషన్‌కు డిమాండ్ చేస్తున్నామని అధవాలే స్పష్టం చేశారు. దళితులు చౌకబారు మద్యానికి బానిసలవతున్నారని.. అలాకాకుండా ఆర్మీలో చేరితో మంచి భోజనంతో పాటు రమ్ము అందుబాటులో వుంటాయని సూచించారు. అయితే రాందాస్ చేసిన వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వున్నాయని.. దళితులంతా మద్యానికి వ్యసనపరులుగా వున్నారనే అర్థం వచ్చేలా అధవాలే చేసిన కామెంట్స్‌‌ వున్నాయని పలువురు ఫైర్ అవుతున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యూట్యూబ్‌లో దేశీ డ్యాన్స్.. క్లాస్ రూమ్‌లోనే ప్రాక్టీస్ (వీడియో)

సామాజిక మాధ్యమాల ప్రభావంతో చిన్న విషయం జరిగినా యూట్యూబ్‌లో వీడియో ద్వారా ...

news

నా భర్తను చూడాలి.. పెరోల్ మంజూరు చేయండి... శశికళ

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు ...

news

చీకటి ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్ లాస్ వెగాస్...

అమెరికాలో ఉన్న ఎడారి నగరాల్లో లాస్ వెగాస్ ఒకటి. దీనికి వందేళ్ళ చరిత్రవుంది. ఇక్కడ ...

news

లాస్ వెగాస్ నరమేధంపై ట్రంప్ దిగ్భ్రాంతి... 58కి చేరిన మృతులు

అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన విషాద సంఘటనపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ...