గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 12 అక్టోబరు 2017 (15:51 IST)

పైఅధికారి భార్యతో వివాహేతర సంబంధం... సైనిక కోర్టులో అతడికి శిక్ష ఏమిటో తెలుసా?

వివాహేతర సంబంధాన్ని తన పైఅధికారి భార్యతో కొసాగిస్తున్నట్లు అంగీకరించిన ఓ సైనిక బ్రిగేడియర్‌కు విధించిన శిక్ష చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే... పశ్చిమ బెంగాల్ లోని సుక్మా ప్రాంతంలో చైనా నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన కీలకమ

వివాహేతర సంబంధాన్ని తన పైఅధికారి భార్యతో కొసాగిస్తున్నట్లు అంగీకరించిన ఓ సైనిక బ్రిగేడియర్‌కు విధించిన శిక్ష చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే... పశ్చిమ బెంగాల్ లోని సుక్మా ప్రాంతంలో చైనా నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన కీలకమైన సైనిక విభాగంలో బ్రిగేడియర్‌గా ఓ ఉద్యోగి పనిచేస్తున్నారు. త్వరలో ఈయన సీనియారిటి ప్రకారం మేజర్ జనరల్‌గా ర్యాంకు పొందనున్నారు. 
 
ఐతే అయ్యగారి చూపు పక్కదారి పట్టింది. తన పైఅధికారి భార్యపై కన్నేశాడు. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. కల్నల్ భార్యతో వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్నట్లు స్వయంగా అతడు సైనిక కోర్టులో అంగీకరించాడు. తప్పు ఒప్పుకున్నాడు కనుక అతడి సీనియారిటీని పదేళ్లు తగ్గిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 
 
దాంతో సీనియారిటీలో అతడి కంటే తక్కువ వున్నవారు అతడికే బాస్ అవుతారన్నమాట. ఇకపోతే అతడు తప్పు అంగీకరించకుంటే... శిక్ష మరింత కఠినంగా వుండేదనీ, అంగీకరించాడు కనుక సీనియారిటీలో కోత విధింపు పడిందని అంటున్నారు.