సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: బుధవారం, 29 నవంబరు 2017 (20:31 IST)

స్తన సౌందర్యానికి ఏవిధమైన వ్యాయామం చేయాలో తెలుసా?

ఆడవారు అందంగా కనపడటానకి తహతహలాడుతుంటారన్నది తెలిసిందే. ఇందుకు చాలామంది పలు వ్యాయామాలు చేస్తుంటారు. కానీ కొందరు తమ స్తన సౌందర్యం గురించి తరచూ ఆవేదన చెందుతుంటారు. అలాంటివారు చిన్నచిన్న వ్యాయమాలు చేస్తే సరిపోతుంది. చాపపై వెల్లికిలా పడుకోవాలి. అరచేతులు బ

ఆడవారు అందంగా కనపడటానకి తహతహలాడుతుంటారన్నది తెలిసిందే. ఇందుకు చాలామంది పలు వ్యాయామాలు చేస్తుంటారు. కానీ కొందరు తమ స్తన సౌందర్యం గురించి తరచూ ఆవేదన చెందుతుంటారు. అలాంటివారు చిన్నచిన్న వ్యాయమాలు చేస్తే సరిపోతుంది. చాపపై వెల్లికిలా పడుకోవాలి. అరచేతులు బోర్లా వుంచాలి. 
 
తలక్రింద దిండు పెట్టుకోవాలి. గాఢంగా గాలిపీల్చి కొంచెంసేపటి తర్వాత గాలివదలాలి. తలను కుడి ఎడమలకు మార్చుతూ వుండాలి. అలా చేస్తే స్తనాల చుట్టుకొలత పెరుగుతుంది. ఇలా కనీసం రోజుకు రెండుసార్లు చేయాలి.
 
2. నిలబడి రెండు చేతులు తొడల వద్దకు జార్చాలి. వెంటనే రెండు చేతులు పైకెత్తి అరచేతులు తలపైన కలపాలి. మరలా క్రిందకు చాపాలి. ఇరువైసార్లు వేగంగా చేస్తే స్తనస్తలం పెరుగుతుంది.
 
3. మేడినూనె లేదా దానిమ్మనూనె తీసుకొని స్తనాల క్రింది నుండి పైకి గుండ్రంగా మాలిష్ చేయాలి. రక్తప్రసరణ పెరిగి స్తనాల బిగుతుగా అందంగా తయారవుతాయి.
 
4. నిలబడి చేతులను గుండ్రంగా ముందువైపుకు, వెనకవైపుకు పదిసార్లు రెండు పూటలా తిప్పాలి.
 
5. నిలబడి రెండుచేతులు ముందుకు వంచి మరలా నడుస్తూ స్తనాల దగ్గరగా వచ్చేలా చేయాలి. అలాచేస్తే స్తనస్థలం వద్ద చర్మము వ్యాకోచము చెంది స్తనాలు పెరుగుతాయి.
 
6. పిల్లలకు పాలిచ్చేటప్పుడు బిడ్డను స్తనానికి వీలైనంత దగ్గరగా వుంచాలి.