Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కంటిచూపును మెరుగుపరిచే చేపలతో పకోడీలు చేసేద్దామా?

శనివారం, 8 ఏప్రియల్ 2017 (11:37 IST)

Widgets Magazine

వారానికి రెండు సార్లు చేప‌ల‌ను తింటే దాంతో డ‌యాబెటిస్ దూరం అవుతుంది. ఇంకా గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింతే బాగా తెలివైన పిల్లలు పుడతారని, కంటిచూపును కూడా మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి చేపలతో కూర, ఫ్రైలు కాకుండా పకోడీలు ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
చేప ముక్కలు - రెండు కప్పులు
కోడిగుడ్లు -  మూడు
కార్న్‌ఫ్లోర్ - మూడు స్పూన్లు
కారం -  రెండు టీ స్పూన్లు
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు, నూనె - తగినంత
నిమ్మరసం - 2 స్పూన్స్
 
తయారు చేసే విధానం :
ఒక పాన్‌ తీసుకుని కోడిగుడ్లను గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి. ఇందులోనే శుభ్రం చేసి వుంచిన చేప ముక్కల్ని కలుపుకోవాలి. చేప ముక్కలకు మసాలా బాగా అంటేలా చేసుకోవాలి. అర్థగంట పాటు ఈ మిశ్రమాన్ని పక్కనబెట్టేయాలి. ఆపై స్టౌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి దోరగా వేపుకోవాలి. ఈ వేయించిన చేప ముక్కల్ని గ్రీన్ చట్నీతో వేపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వంటకాలు

news

కోడిగుడ్లను, బచ్చలికూరను వేడి చేయకూడదు: చికెన్.. మష్రూమ్స్ కూడా?

కోడిగుడ్లను ఉడికించాక కూర లేదా వేపుడును రెండుమూడుసార్లు వేడిచేయడం ద్వారా అందులోని పోషకాలు ...

news

బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేసే చెరకు రసంతో ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలి..?

చెరకు రసంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చెరకు రసంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ...

news

ఉల్లిపాయలను తరిగేటప్పుడు నోటిలో బ్రెడ్ ముక్కను పెట్టుకుంటే?

నోట్లో బ్రెడ్ ముక్కను పెట్టుకుని ఉల్లిని తరగడం ద్వారా అందులోని విడుదలయ్యే కన్నీళ్లు ...

news

కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం, వేస్తే?

దోసెలు, పకోడీ, జంతికలు లాంటివి చేసేటప్పుడు కొద్దిగా పాలు పోసి పిండి కలపాలి. ఆ తర్వాత ...

Widgets Magazine