Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొబ్బరినీళ్లతో మొటిమలను దూరం చేసుకోండి.. కొబ్బరినీళ్లు, కీరదోస, పచ్చిపాలతో?

శనివారం, 8 ఏప్రియల్ 2017 (11:24 IST)

Widgets Magazine

కొబ్బరినీళ్లు మొటిమలను దూరం చేస్తాయి. అందుకే వేసవిలో రాత్రి నిద్రించేందుకు ముందు కొబ్బరినీళ్లలో దూదిని ముంచి.. మొటిమలున్న చర్మంపై రాస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఇలా రోజూ చేయడం వల్ల మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. కొబ్బరినీళ్లను ముఖమంతా రాస్తూ ఉంటే మురికి కూడా పోతుంది. సాధారణ నీటి కంటే కొబ్బరినీళ్లలో ముఖం కడిగితే తాజాదనం లభిస్తుంది. 
 
చర్మానికి తేమ కూడా అందిస్తుంది. ముఖం ఆరోగ్యంగా, తాజాగా కనిపిస్తుంది. చెంచా పెసరపిండిని చెంచా కొబ్బరినీళ్లతో కలిపి ముఖానికి రాసి మృదువుగా రుద్దాలి. ఇది నలుగులా పనిచేసి ముఖ కాంతిని పెంచుతుంది. 
 
చెంచా గంధం పొడి, అరచెంచా పసుపూ, తగినన్ని కొబ్బరినీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరాక కడిగేస్తే చక్కటి రంగు వస్తుంది. ముఖం మీది నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ట్యాన్‌ను తొలగించుకోవాలంటే.. రెండు చెంచాల కొబ్బరి నీళ్లలో చెంచా ముల్తానీ మట్టి కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం మీద పేరుకుపోయిన నలుపుదనం, నల్లమచ్చలు తగ్గిపోతాయి. 
 
అలాగే సమపాళ్లలో కొబ్బరినీళ్లు, కీరదోస రసం, పచ్చిపాలు కలపాలి. దీన్ని ముఖానికి రాసి పది నిమిషాలపాటు వలయాకారంగా రుద్దుతూ ఉండాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల చర్మం మెరుస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

స్త్రీలు ఆఫీసుల్లో కొత్త ఉత్సాహంతో పనిచేస్తుంటే అదే కారణమట...

చాలామంది స్త్రీలు ఆఫీసుల్లో చాలా ఉత్సాహంగా, చలాకీగా పని చేస్తుంటారు. దీనికి కారణం ఉందని ...

news

కంటి కింద నల్లటి వలయాలు మాయం కావాలంటే..?

కంటి కింద నల్లటి వలయాలు మాయం కావాలా? ఇంట్లో వాడే వస్తువులతోనే కంటి కింది వలయాల ...

news

ముదురు రంగు చాక్లెట్ తినండి.. అందంగా కనిపించండి..

ముదురు రంగు చాక్లెట్‌ను రోజుకొకటి తీసుకోవడం ద్వారా అందంగా కనిపించవచ్చునని.. చర్మ సౌందర్య ...

news

బీట్రూట్ జ్యూస్.. సౌందర్యానికే కాదు.. లివర్‌కు మంచిదే..

వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి తేజస్సు సమకూర్చుకోవచ్చు. ఇంకా రోజూ ఓ కప్పు యాపిల్ జ్యూస్ ...

Widgets Magazine