శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Modified: శుక్రవారం, 3 మే 2019 (19:55 IST)

వేసవిలో చమట విపరీతం... ఒళ్లు పేలినప్పుడు ఏం చేయాలి...?

వేసవిలో చర్మం పేలడం సహజంగా జరుగుతుంటుంది. సన్నని, ఎర్రని పొక్కులు చర్మంపై కనిపిస్తాయి. వీటి కారణంగా మంట, దురద విపరీతంగా ఉంటుంది. గోకితే ఇబ్బంది మరీ పెరుగుతుంది. అటువంటి ఇబ్బంది నుండి బయటపడాలంటే ఈ క్రింది చిట్కాలు పాటించాలి.
 
కలబంద గుజ్జును పేలిన చోట రాసుకుని కొద్దిసేపు ఆగిన తర్వాత స్నానం చేయాలి. 
 
చందనం, అత్తరు కలిపి ఒక ముద్దలా చేసి దానిని పేలినచోట పలుచని పొరగా రాసుకోవాలి. 
 
అదేవిధంగా పేలపిండి, నీటిని కలిపి చేసిన ముద్దను పేలిన చర్మంపై రాసుకుని అది ఎండిపోయిన తర్వాత స్నానం చేయాలి. 
 
ఇంకా శరీరాన్ని చల్లబరిచే షర్బత్ లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకుంటే ఒళ్లు పేలదు.