1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Modified: గురువారం, 2 మే 2019 (20:48 IST)

ఎండలు మండుతున్నాయ్ బాబోయ్... చర్మం కమిలిపోతోంది... సంరక్షించుకోవడం ఎలా?

మండే ఎండల్లో చర్మ సంరక్షణకు కొన్ని చిట్కాలు పాటించండి. ఎండల్లో చర్మం కమిలినట్లయితే ముఖ్యంగా పొడిచర్మం కలిగినవారు పంచదార, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి గుండ్రంగా మృదువుగా మసాజ్ చేసుకోవాలి. 
 
ఒక స్పూన్ బంగాళా దుంప రసం, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి రాసి పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. తగ్గేవరకూ రోజూ ఇలా చేస్తూనే ఉండాలి. 
 
కీరా రసం తీసి, ఒక  టేబుల్ స్పూన్ చల్లని పాలలో కలిపి రాసి పావుగంట ఆగిన తర్వాత చల్లని నీటితో కడిగి వేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు రాయాలి. మూడు టేబుల్ స్పూన్ల పాలు, ఒక టేబుల్ స్పూన్ పసుపు కలిపి రాసి, కొద్దిసేపాగి కడిగి వేయాలి. 
 
కొద్దిగా అలోవేరా ఆకులు తీసుకుని నలిపి, నిమ్మరసం కలిపి పేస్టు మాదిరి చేసి రాసుకుంటే చర్మం మృదువుగా మారి మెరిసిపోతుంది. ఆలివ్ ఆయిల్ మసాజ్ వల్ల ఫలితం కనిపిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక నిమ్మకాయరసం కలిపి కమిలిన చర్మంపై రాయాలి. 
 
నీటిలో క్యాబేజీ ముక్కలు వేసి కాచి, నీటిని వడగట్టి, ముక్కల్ని గుజ్జులా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఆగిన తర్వాత కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేయాలి.