శుక్రవారం (27-04-18) దినఫలాలు - స్నేహితుల వల్ల విలువైన వస్తువులు...

మేషం : డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వేళతప్పి భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రముఖుల కలయిక వాయిదా పడుట వల్ల నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగులకు ప్రకటనలు, మధ్యవర్తుల

daily astro
pnr| Last Updated: శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (08:51 IST)
మేషం : డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వేళతప్పి భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రముఖుల కలయిక వాయిదా పడుట వల్ల నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగులకు ప్రకటనలు, మధ్యవర్తుల విషయంలో అవగాహన ముఖ్యం. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు.

వృషభం : పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ పనులు మందకొడిగా సాగుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనుపు ఇవ్వటం మంచిది కాదు.

మిధునం : ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. మీ స్నేహితులవల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.

కర్కాటకం : ఏసీ కూలర్ మోకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసం పొందుతారు. రాజకీయ నాయకులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో సంభాషించటం వల్ల మీలో మానసికధైర్యం, కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటాయి.

సింహం : అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించేవారుండరు. ప్రకటనలు, రాజకీయ కళా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవ, పుణ్య సేవా కార్యాల పట్ల మరింతగా ఆసక్తి పెంచుకుంటారు.

కన్య : వస్త్ర, బంగారు, ఫ్యాన్సీ, పచారి వ్యాపారస్తులకు సంతృప్తి, పురోభివృద్ధి పొందుతారు. అలౌకిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. భాగస్వామ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు రాగలవు. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల జోక్యం వలన మీ పాత సమస్యలు పరిష్కరించబడతాయి.

తుల : స్థిరచరాస్తుల క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి కలిసివస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉమ్మడి వ్యాపారాల్లో పునరాలోచన అవసరం.

వృశ్చికం : స్త్రీలకు అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత మెళుకువ చాలా అవసరం. సంతానం పై చదువుల కోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు.

ధనస్సు : రాజకీయాల్లో వారు ముఖ్యమైన వ్యవహారాలను గోప్యంగా ఉంచడం మంచిది. కళాకారులకు, రచయితలకు, పత్రికారంగంలోని వారికి అనుకూలమైన కాలం. బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆస్తి పంపకాలలో పెద్దల తీరు మిమ్ములను ఇరకాటంలో పెట్టొచ్చు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.

మకరం : కుటుంబంలో ప్రశాంతత, ప్రేమానుబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులు అధికారులతో సాన్నిత్యం నెలకొంటుంది. విదేశీ చదువులకై చేయు ప్రయత్నాలలో విజయం. తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. నిరుద్యోగులు సదవకాశాలు జారవిడుచుకుంటారు.

కుంభం : స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఆహార విషయంలో వేళ తప్పి భుజించుట వలన ఆరోగ్య భంగం. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేసినగాని నిలదొక్కుకోలేరు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.

మీనం : దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. రెట్టించిన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాల విషయంలో పునరాలోచన అవసరం. మీ యత్నాలకు మీ శ్రీమతి నుంచి అన్ని విధాలా ప్రోత్సాహం లభిస్తుంది.



దీనిపై మరింత చదవండి :