సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (09:44 IST)

బుధవారం (25-04-18) దినఫలాలు - మిమ్మలను పొగిడేవారిని...

మేషం : కుటుంబీకులతో కలిసి దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాభివృద్దికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో స

మేషం :  కుటుంబీకులతో కలిసి దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాభివృద్దికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
వృషభం : స్త్రీలకు అన్ని విధాల శుభదాయకంగా ఉంటుంది. మిమ్ములను పొగిడే వారిని ఒక కంట కనిపెట్టండి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు వేగవంతమవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రత్సాహం లభిస్తుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
మిథునం : ఉద్యోగస్తులు ఉధికారులను మెప్పిస్తారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మిత్రుల మధ్య విబేధాలు తొలగిపోతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులెదుర్కుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. కాంట్రాక్టుల కోసం యత్నిస్తారు.
 
కర్కాటకం : మీ ప్రగతికి కుటుంబ సభ్యులు సహకరిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. క్లిష్టతరమైన పనుల్ని ఎలా అధిగమించాలో తెలియనప్పుడు తగిన సూచనలు పాటించండి. ఐరన్, సిమెంట్, కలప రంగాలలో వారికి చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో సంతృప్తికానరాదు.
 
సింహం : ముఖ్యంగా ఇతరుల వ్యాపార విషయంలో జోక్యం అంత మంచిదికాదని గమనించండి. సభ, సమావేశాల్లో కుటుంబీకుల ప్రేమకు మరింత దగ్గరవుతారు. అవివాహితులకు వివాహ శుభ సూచన. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. దైవ దర్శనాలలో పాల్గొంటారు.
 
కన్య : చేపట్టిన ప్రాజెక్టులలో జాప్యం ఎదురవ్వచ్చు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ధనం ఏ మాత్రం నిల్వచేయకపోతారు. గతంలో జరిగిన తప్పుల నుంచి మంచిని నేర్చుకోండి. సినిమా, విద్యా కార్యక్రమాలలో పాల్గొంటారు. వర్తమానంపై మరింత దృష్టి పెట్టండి.
 
తుల : ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతో కాక, మీ సీనియర్ల సలహాలు తీసుకొని ముందుకు సాగండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో మంచి లాభం ఉంటుంది. గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. ఖర్చులు అధికం. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది.
 
వృశ్చికం : స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. భార్యా భర్తత మధ్య విబేధాలు తలెత్తవచ్చు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. మాటలతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. స్వయకృషితో అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక వ్యవవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు.
 
ధనస్సు : బ్యాంకు డిపాజిట్లు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రేమికులకు పెద్దల నుంచి ప్రోత్సాహం, సన్నిహితుల సహకారం ఉంటాయి.
 
మకరం : చిట్స్, ఫైనాన్సు వ్యాపారాలకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. కొంతమంది ముమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. వివాహ, ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు.
 
కుంభం : రిప్రజింటేటివులు, పోస్టల్, ఎల్ఐసీ ఏజెంట్లు టార్గెట్లను అధికమిస్తారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఆస్తి పంపకాల విషయమై పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. రేషన్ డీలర్లు, నిత్యావసర వస్తు స్టాకిస్టులకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి.
 
మీనం : వస్త్ర, ఫాన్సీ, పచారీ మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. బ్యాంకు పనులు, దూర ప్రయాణాల్లో మెళకువ వహించండి. ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా వెలితిగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పత్రిక, ప్రమేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం.