సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : గురువారం, 26 ఏప్రియల్ 2018 (08:53 IST)

గురువారం (26-04-18) దినఫలాలు - ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు...

మేషం : ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తికానరాదు. కార్యక్రమాలలో ఆటంకాలను అధికమిస్తారు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు ఒడిదుడుకులు తప్పవు. ముమ్ములను పొగిడేవారిని ఓ కంట కనిపెట్టి ఉం

మేషం : ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తికానరాదు. కార్యక్రమాలలో ఆటంకాలను అధికమిస్తారు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు ఒడిదుడుకులు తప్పవు. ముమ్ములను పొగిడేవారిని ఓ కంట కనిపెట్టి ఉండండి. కాంట్రాక్టర్లు పనివారల వల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది.
 
వృషభం : వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో రాణిస్తారు. స్త్రీలకు ఉదరం, మోకాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ప్రముఖుల పరిచయాలు, పాతమిత్రుల కలయిక మీ ఉన్నతికి దోహదపడతాయి. ప్రేమికుల మధ్య విబేధాలు తలెత్తుతాతయి. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన మంచిది.
 
మిథునం : ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. గృహంలో మార్పులు వాయిదా పడతాయి. స్త్రీలకు అన్నివిధాల శుభదాయకంగా ఉంటుంది. క్రయ విక్రయ రంగాల్లో వారికి సంతృప్తి కానరాగలదు. ముఖ్యమైన పర్యటనలలో అవాంతారాలెదురైనా జయం పొందుతారు.
 
కర్కాటకం : ఆప్తుల నుంచి ఆహ్వానాలకు అందుకుంటారు. రావలసిన ధనం వసూలలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందిని కలిగిస్తాయి. స్నేహ సంబంధ బంధవ్యాలు విస్తరిస్తాయి. రచయితలకు రాణింపు లభిస్తుంది. సమయాన్ని వృధా చేసే కొలది నష్టాలను ఎదుర్కుంటారు.
 
సింహం : ఆదాయానికి సరిపడని ఖర్చు కానవస్తుంది. నూనె, ఎండుమిర్చి, పసుపు, ధనియాలు, బెల్లం, శనగలు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. పౌరోహితులకు, వృత్తులలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. చిన్నతరహా పరిశ్రమలలో వారికి అనుకూలత. ధైర్యంతో ముందుకు సాగండి.
 
కన్య : ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. రిప్రజింటేటివులకు పురోభివృద్ధి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి అధికమవుతుంది. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారి తీస్తాయి. అధికారులతో ఏకీభావం కుదరదు.
 
తుల : కొబ్బరి, పండ్లు, పానీయ వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. చర్చలలో కొన్ని లోపాలు తలెత్తటం వలన రాజకీయలలో వారికి ఆందోళన తప్పదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. మిమ్మల్ని హేళన చేసే వారు మీ సహాయాన్ని అర్ధిస్తారు.
 
వృశ్చికం : ఆటోమొబైల్, రవాణా, మెకానికల్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచటం మంచిది. మీ ఉన్నతిని చాటుకోవలానే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగీ ఖర్చు చేస్తారు. బంధుమిత్రులతో పట్టింపులు ఎదుర్కుంటారు. మీ సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు.
 
ధనస్సు : నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు సంతృప్తి, పురోభివృద్ధి. ప్రయాణాలలో అసైకర్యానికి లోనవుతారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. ప్రియతముల రాక, సమాచారం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం.
 
మకరం : వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులు చదువుల పట్ల ఏకాగ్రత, పట్టుదల చాలా అవసరం. ఉద్యోగస్తులు తలపెట్టిన పనుల్లో అవాంతరాలను ఎదుర్కుంటారు.
 
కుంభం : చేపట్టిన పనిలో దృఢ సంకల్పం ఉంటే విజయం తధ్యం. వాహనం ఇతరులకిచ్చి సమస్యలను ఎదుర్కుంటారు. స్త్రీలకు శ్రమ, బంధువుల మధ్య ఏరపడిన సందిగ్ధ పరిస్థితులు తీరిపోతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. పాత ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
 
మీనం : రుణ యత్నాల్లో అలసత్వం వంటి చికాకులను ఎదుర్కుంటారు. ఆత్మీయుల నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు ప్రశాంతంగా సాగుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు.