1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2017 (05:52 IST)

శుభోదయం : మీ రాశి ఫలితాలు 26-08-17

మేషం : ఈ రోజు వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు మంచి ఫలితాలనిస్తాయి. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు సంతోషపరుస్తాయి. ప్రముఖ సంస

మేషం : ఈ రోజు వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు మంచి ఫలితాలనిస్తాయి. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు సంతోషపరుస్తాయి. ప్రముఖ సంస్థల్లో భాగస్వామ్యం కోసం యత్నాలు సాగిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. 
 
వృషభం : ఈ రోజు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. 
 
మిథునం : ఈ రోజు ఆర్థికస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంకల్పబలంతో మీ యత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. స్త్రీలకు ప్రతిభకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. బకాయిలు, ఇంటి అద్దెలు, ఇతరాత్రా వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. మీ శ్రీమతి ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
కర్కాటకం : ఈ రోజు కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. మీ సంతానానికి దూర ప్రాంతంలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికవుతుంది. దేవాలయ, విద్యా సంస్థలు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. 
 
సింహం : ఈ రోజు బంధువుల ఆకస్మిక రాకతో ఇబ్బందులెదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగానే జరుగుతాయి. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రేమికులకు పెద్దల నుంచి ప్రోత్సాహం, సన్నిహితుల సహకారం ఉంటాయి. 
 
కన్య : ఈ రోజు విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు. దైవదర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది మీ నుంచి ధనసహాయం లేక ఇతరాత్రా సాయం అర్థిస్తారు. చేపట్టిన పనులలో ఏకాగ్రత ఎంతో అవసరం. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. 
 
తుల : ఈ రోజు స్త్రీలకు కుటుంబ, ఆర్థిక పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారాల్లో ఆటంకాలు, ధననష్టం వంటి చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సహోద్యోగులతో సౌమ్యంగా మెలగవలసి ఉంటుంది. కొంతమంది మిమ్మలను ఉద్రేకపరిచేలా సంభాషిస్తారు. ప్రతి విషయంలోనూ శాంతంగా వ్యవహరించాలి. 
 
వృశ్చికం : ఈ రోజు అన్ని వ్యవహారాల్లో జయం లభిస్తుంది. స్త్రీలు దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ వంటి శుభపరిణామాలుంటాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
ధనస్సు : ఈ రోజు విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. వాహనం విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. 
 
మకరం : ఈ రోజు గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు అన్ని విధాలా శుభదాయకంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయం కావడంతో వారిలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. 
 
కుంభం : ఈ రోజు హోదాలో ఉన్న అధికారులు అపరిచితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉంది. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. చిరు వ్యాపారులకు సంతృప్తి పురోభివృద్ధి కానవస్తుంది. 
 
మీనం : ఈ రోజు బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. మొండిబాకీలు వసూలు కాగలవు. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. డాక్టర్లు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తారు.