మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2017 (05:50 IST)

శుభోదయం : మీ రాశి ఫలితాలు 23-08-17

మేషం : ఈ రోజు విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం సంతృప్తినిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడంతో పాటు అనుభవం గడిస్తార

మేషం : ఈ రోజు విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం సంతృప్తినిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడంతో పాటు అనుభవం గడిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాల జోలికి పోవటం మంచిది కాదు. ఖర్చులు పెరిగినా ధనానికి లోటుండదు. 
 
వృషభం : ఈ రోజు పెద్దలకు ఆరోగ్య భంగం, వైద్య పరీక్షలు అవసరమవుతాయి. కుటుంబీకుల ధోరణి చికాకు కలిగిస్తుంది. విద్యార్థుల క్రీడ, క్విజ్ పోటీల్లో విజయం సాధిస్తారు. భాగస్వామిక చర్చలు, సంప్రదింపులు ఫలిస్తాయి. స్త్రీలకు బంధువులు, పొరుగువారితో సఖ్యత నెలకొంటుంది. మీ సంతానానికి కోరుకున్న విద్యావకాశం లభిస్తుంది. 
 
మిథునం : ఈ రోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఉన్నతాధికారులకు అదనపు బాధ్యతలు, కిందిస్థాయి సిబ్బందితో చికాకులు తప్పవు. తలపెట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా సాగుతాయి. మీ మాటకు అన్ని చోట్ల మంచి స్పందన లభిస్తుంది. 
 
కర్కాటకం : ఈ రోజు నూతన ప్రయోగాలు, సాహస కృత్యాలకు దూరంగా ఉండటం మంచిది. ఆస్తి, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉపాధ్యాయుల శ్రమకు తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. సేవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
సింహం : ఈ రోజు మీరెంతగానో ఆందోళన చెందిన ఒక సమస్య సునాయాసంగా పరిష్కారమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రయోజనమైన ఖర్చులే ఉంటాయి. ఆహార, ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. మీ సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయడం మంచిది. 
 
కన్య : ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధికమిస్తారు. స్త్రీలకు అయినవారి ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు అధికం. వాహనం నిదానంగా నడపడం మంచిది. బదిలీలపై వచ్చిన ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో సఫలీకృతులవుతారు. 
 
తుల : ఈ రోజు కుటుంబీకుల కోసం బాగా శ్రమిస్తారు. ధనమూలకంగా సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి ఇబ్బందులెదుర్కొంటారు. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. 
 
వృశ్చికం : ఈ రోజు ప్రేమ, వ్యవహారాల్లో అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. సంతకాలు, చెక్కుల జారీలో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులు, అధికారులు, ధన ప్రలోభానికి దూరంగా ఉండటం మంచిది. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. 
 
ధనస్సు : ఈ రోజు ఫ్లీడర్లు ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. చక్కని ఆలోచనలు, మంచి ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. కొన్ని విషయాల్లో మీ ఊహలు, అంచనాలు నిజమవుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. మీ అభిప్రాయాలు, పథకాలు గోప్యంగా ఉంచండి. ఆస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మకరం : ఈ రోజు ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. జాగ్రత్త వహించండి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. దైవ, సేవ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాణిజ్య ఒప్పందాలు, నూతన పెట్టుబడుల విషయంలో ఏకాగ్రత ముఖ్యం. 
 
కుంభం : ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించడం మంచిది. దేనియందు ఏకాగ్రత అంతగా ఉండదు. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త. గత సంఘటనలు పదేపదే జ్ఞప్తికి వస్తాయి. ఆత్మీయులకు ఒక ముఖ్య సమాచారం అందిస్తారు. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. 
 
మీనం : ఈ రోజు విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. స్థోమతకు మించి ఖర్చులు చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు తప్పవు. వృత్తి వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది.