1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2017 (05:55 IST)

శుభోదయం : మీ రాశి ఫలితాలు 25-08-17

మేషం : ఈ రోజు విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ సంతానంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. మిమ్మలను పొగిడిన వారే విమర్శించడానికి వెనుకాడరు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారాలు లాభసాట

మేషం : ఈ రోజు విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ సంతానంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. మిమ్మలను పొగిడిన వారే విమర్శించడానికి వెనుకాడరు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. 
ఈ రాశివారు వినాయకుడిని మారేడు ఆకులతో ఆరాధించినా ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి చేకూరుతుంది. 
 
వృషభం : ఈ రోజు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో పెద్దల సలహా పాటించడం మంచిది. గృహంలో ఒక శుభకార్యం అనుకూలిస్తుంది. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. తరచూ దైవ, సేవా పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. 
ఈ రాశివారు ఉత్తరేణీ ఆకులతో వినాయకుడిని పూజించినా పురోభివృద్ధిని పొందుతారు. 
 
మిథునం : ఈ రోజు వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. దూరపు బంధువులను ఇంటికి ఆహ్వానిస్తారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. విద్యార్థులు పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకోకుండా కొన్ని పనులు వాయిదాపడతాయి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు.
ఈ రాశివారు కలువపూలతో వినాయకుడిని పూజించినా సర్వదా శుభం కలుగుతుంది. 
 
కర్కాటకం : ఈ రోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబీకులతో కలిసి దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల రాక మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. మీ మాటే నెగ్గాలన్న పంతం విడనాడండి. 
ఈరాశివారు గరికెతో వినాయకుడిని ఆరాధించినా శుభం, జయం పురోభివృద్ధి కానవస్తుంది. 
 
సింహం : ఈ రోజు బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరిగినా ఇబ్బందులే మాత్రం ఉండవు. దైవ, శుభకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 
ఈ రాశివారు వినాయకుడికి మేడి ఆకులతో ఆరాధించినా సర్వదా శుభం కలుగుతుంది. 
 
కన్య : ఈ రోజు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఇబ్బందులేమాత్రం ఉండవు. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. స్త్రీలకు, వస్త్ర, వస్తులాభం వంటి శుభపరిణామాలుంటాయి. విందులు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
ఈ రాశివారు వినాయకుడిని తెల్లజిల్లేడు ఆకులతో పూజించినా ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు. 
 
తుల : ఈ రోజు సంతాన సౌఖ్యం, కుటుంబంలో సఖ్యత నెలకొంటాయి. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి కానవస్తుంది. తరచూ విందులు దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏమాత్రం పొదువు సాధ్యంకాదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఫలితాలు ఆశించిన విధంగా ఉండవు. 
ఈ రాశివారు రావి ఆకులతో వినాయకుడిని పూజించినా సర్వదా, శుభం, జయం చేకూరుతుంది. 
 
వృశ్చికం : ఈ రోజు స్త్రీలు శుభకార్యాల్లో పలువురిని ఆకట్టుకుంటారు. విందులలో పరిమితి పాటించండి. ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. స్థిరచరాస్తులు క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. 
ఈ రాశివారు వినాయకుడికి చండ్ర పత్రాలతో పూజించినా మీ సంకల్పం సిద్ధిస్తుంది. 
 
ధనస్సు : ఈ రోజు గతంలో నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విందులు, వినోదాల్లో అందిరనీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. 
ఈ రాశివారు మామిడి ఆకులతో వినాయకుడిని ఆరాధించినా మీ సంకల్పం, మనోసిద్ధి చేకూరుతుంది. 
 
మకరం : ఈ రోజు కుటుంబం సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. గృహ మార్పు కోసం యత్నాలు సాగిస్తారు. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించి ఇబ్బందులెదుర్కొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. బంధువుల ఆకస్మికరాక ఆశ్చర్యం కలిగిస్తుంది. 
ఈ రాశివారు బిల్వదళాలతో వినాయకుడిని పూజించినా మీ సంకల్పం సిద్ధిస్తుంది. 
 
కుంభం : ఈ రోజు భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. స్త్రీలకు టీవీ చానెళ్ళ నుంచి ఆహ్వానం, పారితోషికం, బహుమతులు అందుతాయి. విద్యార్థులు వాహనం వీలైనంత నిదానంగా నడపడం క్షేమదాయకం. వ్యవసాయ రంగాల వారికి ఎరువులు, క్రిమి సంహారక మందుల కొనుగోళ్ళలో చికాకులు, ఇబ్బందులు తప్పవు. 
ఈ రాశివారు వినాయకునికి మోదుక ఆకులతో ఆరాధించినా శుభం, జయం చేకూరుతుంది. 
 
మీనం : ఈ రోజు బంధువుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకోవలసి ఉంటుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
ఈ రాశివారు జెమ్మి ఆకులతో వినాయకుడిని ఆరాధించినా శుభం కలుగుతుంది.