గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (05:54 IST)

శుభోదయం : ఈ రోజు మీ రాశి ఫలితాలు 15-09-17

మేషం: బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ సంతానం విద్యా, వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబ

మేషం: బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ సంతానం విద్యా, వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణంలోని మార్పు ఆందోళన కలిగిస్తుంది.
 
వృషభం : దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వృద్ధి చెందుతాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల  సమర్థత, ప్రతిభకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. మంచితనంతో విరోధులను ఆకట్టుకంటారు.
 
మిథునం: కుటుంబంలో కలతలు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. ఆదాయాన్ని మించి ఖర్చులుంటాయి. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ యత్నం ఫలించదు. స్త్రీల మనోవాంఛలు, అవసరాలు నెరవేరతాయి. మీ ఆంతరంగిక, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. పాతమిత్రులు, చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు.
 
కర్కాటకం: లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇతరుల ముందు మీ ఉన్నతిని చాటుకునే యత్నాలు విరమించండి. వీసా, పాస్ పోర్ట్ వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి.
 
సింహం: ఆర్థిక పురోగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. మీ అంచనాలు, పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రుణం కొంత మొత్తాన్నైనా తీర్చాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. మీ సంతానంతో సరదాగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
కన్య : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మిమ్మల్ని చూసి అసూయ పడేవారు అధికం అవుతున్నారని గ్రహించండి.
 
తుల: కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఒక సమాచార లోపం వల్ల సదవకాశాలు చేజారిపోతాయి. వీలైనంత వరకూ మీ పనులు చూసుకోవడం మంచిది. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం.
 
వృశ్చికం : బంధు మిత్రులతో వివాదాలు తలెత్తుతాయి. వృత్తిరీత్యా మీ బాధ్యతలు పెరుగుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తులపట్ల, వస్తువుల పట్ల మెళకువ అవసరం. స్త్రీలకు అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత చోటుచేసుకుంది.
 
ధనస్సు : ఆర్థిక విషయల్లో ఒకింత పురోగతి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు.
 
మకరం: వృత్తిపరమైన చికాకులను ఎదుర్కొనవలసివస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిర్మాణ పనుల్లో బిల్డర్లకు ఏకాగ్రత అవసరం. రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. బంధువులతో స్వల్ప అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది.
 
కుంభం : రాజకీయ, సాంకేతిక రంగాల వారికి శ్రమాధిక్యం తప్పదు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కొంటారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు వుంటాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.
 
మీనం: ఉద్యోగస్తులు తోటివారి నుండి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రతికూల వాతావరణంలో అనుకూల ఫలితాలు సాధించడానికి ప్రయత్నిస్తారు. నగదు చెల్లింపు చెక్కుల జారీ విషయంలో జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరిగినా ఇబ్బందులు వుండవు.