Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శుభోదయం : ఈ రోజు మీ రాశి ఫలితాలు 13-09-17

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (05:42 IST)

Widgets Magazine
time

మేషం : ఈ రోజు వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమించాలి. స్త్రీల, కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. గట్టిగా ప్రయత్నిస్తేనే మొండిబాకీలు వసూలవుతాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, అంకితభావం ముఖ్యం. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.
 
వృషభం : ఈ రోజు ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏమరుపాటు, నిర్లక్ష్యం ఇబ్బందులకు దారితీస్తాయి. ఏమాత్రం పొదుపు సాధ్యం కాదు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. కొత్త వ్యాపారాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రస్తుతానికి తగవు.
 
మిథునం : ఈ రోజు ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. మీ ఆలోచనలు, ప్రణాళికలు గోప్యంగా ఉంచడం మంచిది.
 
కర్కాటకం : ఈ రోజు మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు. ఆహార వ్యవహారాలలో మెళకువ వహించండి. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించడం మంచిది.
 
సింహం : ఈ రోజు ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులుంటాయి. దైనందిన కార్యక్రమాలలో మార్పులుండవు. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం వంటివి ఎదుర్కొంటారు. ఒకకార్యం నిమిత్తం ప్రయాణం చేస్తారు. బిల్డర్లకు చికాకులు తప్పవు.
 
కన్య : ఈ రోజు బంధు మిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించడం మంచిదికాదని గమనించండి. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం అధికం.
 
తుల : ఈ రోజు సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. రావలసిన ధనం అందక పోవడం వల్ల ఆందోళన చెందుతారు. శత్రువులు, మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. కోర్టు వ్యవహారాలకు ధనం బాగా ఖర్చు చేస్తారు.
 
వృశ్చికం : ఈ రోజు రవాణా రంగాల వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిత్రులు కూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. పొదువు విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ, పుణ్యకార్యాలకు ధనం విరివిగా ఖర్చు అవుతుంది.
 
ధనస్సు : ఈ రోజు ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతల వల్ల చికాకులు, పనిభారం తప్పవు. మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయవలసి వస్తుంది. ప్రయాణాలు సుఖవంతంగా సాగుతాయి. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తుల మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోనూ, చెల్లింపుల్లోనూ అప్రమత్త చాలా అవసరం.
 
మకరం : ఈ రోజు మీ సన్నిహితుల వైఖరి వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అంతగా పరిచయం లేని వారికి ధన సహాయం చేసే విషయంలో అప్రమత్త అవసరం. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రైవేటు, పబ్లిక్ సంస్థల్లో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి.
 
కుంభం : ఈ రోజు స్త్రీల మనోవాంఛలు నెరవేరడంతో గృహంలో ప్రశాంతత, సౌఖ్యం నెలకొంటాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తరచూ యూనియన్ కార్యకలాపాల్లో నిమగ్నులై ఉంటారు. ఎక్కువగా శ్రమించిన కొద్ది ఫలితాలు ఉంటాయి. పత్రిక, మీడియా రంగాల వారికి శాంతి నూతన అవకాశాలు లభిస్తాయి.
 
మీనం : ఈ రోజు సినిమా రంగాల్లో వారికి సమస్యలు తలెత్తుతాయి. శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమ, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. వ్యవసాయ కూలీలకు, భవన కార్మికులకు మందకొడిగా ఉంటుంది. ఉద్యోగస్తులు స్థానచలన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

శుభోదయం : ఈ రోజు మీ రాశి ఫలితాలు 12-09-17

మేషం : ఈ రోజు నదీ స్నానాలు ఆచరించునపుడు జాగ్రత్త అవసరం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ...

news

శుభోదయం : ఈ రోజు మీ రాశి ఫలితాలు 11-09-17

మేషం: విలువైన కానుక ఇచ్చి మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు. దైవ, పుణ్య కార్యాలకు సహాయ ...

news

సూర్యభగవానుడిని ఇలా పూజిస్తే.. గ్రహదోషాలుండవు..

సూర్య భగవానుడిని రోజూ పూజిస్తే సకల గ్రహ దోషాల నుంచి విముక్తి రావడమే కాకుండా ఆరోగ్యం, ...

news

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 10-09-17

మేషం : స్త్రీలు ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు చేయడం క్షేమదాయకం కాదు. పత్రికా, మీడియా రంగాల ...

Widgets Magazine