శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (17:56 IST)

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 10-09-17

మేషం : స్త్రీలు ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు చేయడం క్షేమదాయకం కాదు. పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత చాలా అవసరం. పెద్దల ఆరోగ్యములో జాగ్రత్త అవసరం. ర

మేషం : స్త్రీలు ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు చేయడం క్షేమదాయకం కాదు. పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత చాలా అవసరం. పెద్దల ఆరోగ్యములో జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృషభం : బంధువులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. రవాణా రంగాలవారికి ప్రయాణీకులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
మిథునం : రచయితలకు, పత్రికా, ప్రైవేట్ సంస్థల్లో వారికి ఆశించినంత పురోభివృద్ధి. స్థిరాస్తి అమ్మకం వాయిదా వేయడం మంచిది. రుణం కొంత మొత్తం తీర్చడంలో ఒత్తిడి నుంచి కుదుటపడతారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరుపాటు అశ్రద్ధ కూడదు. పండ్లు, పూలు, కొబ్బరి వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
కర్కాటకం: అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలు దైవ, పుణ్యకార్యాల్లో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తారు. విద్యార్థులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
సింహం: మీకళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. మీ సంతానం కోసం ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. స్త్రీలకు దైవ, పుణ్య, శుభకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులకు నిదానం అవసరం. అందరితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు.
 
కన్య : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం లభిస్తుంది. ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదముంది. జాగ్రత్త వహించండి. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. మీయత్నాలకు బంధువులు సహకరిస్తారు. స్త్రీలకు అలంకరణలు, విలాసవస్తువుల మీద మక్కువ పెరుగుతుంది.
 
కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. ఊహించని ఖర్చులు చికాకు పరుస్తాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. కళా, సాంస్కృతిక, బోధన, విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్ధికంగా ప్రోత్సహకరంగా ఉంటుంది. బిల్లులు చెల్లిస్తారు.
 
బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. తెలివి తేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. సహోద్యోగులతో వ్యక్తిగత విషయాలు చర్చకు వస్తాయి. రావలసిన ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.
 
భాగస్వామిక ఒప్పందాలు, ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలిస్తాయి. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహనకు వస్తారు. వడ్డీలు, డిపాజిట్లు అందుకుంటారు.
 
శ్రీవారు, శ్రీమతికి సంబంధించి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. పెద్దల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసే వారు మీ సహాయం ఆర్ధిస్తారు. ఫీజులు చెల్లిస్తారు.
 
మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. పాత సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. విద్యార్ధులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందిలింపులు తప్పవు. నిరుద్యోగులలో ఉద్యోగావకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు.
 
కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేస్తారు. వ్యవసాయ రంగాల వారికి విత్తనాల కొనుగోలు విషయంలో మెళుకువ అవసరం. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. పెన్షన్, భీమా పనులు పూర్తవుతాయి.