బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 20 సెప్టెంబరు 2018 (20:00 IST)

ఏకాంతంలో భగవంతుని ప్రార్థించటమే మేలు

భగవంతుడు నిరాకారుడా, సాకారుడా అని తలపోస్తూ తల బ్రద్దలు కొట్టుకోవలసిన అగత్యం ఏముంది... ఏకాంత ప్రదేశంలో మనోవ్యాకులతతో విలపిస్తూ, భగవాన్ నువ్వు ఎలా ఉన్నావో నాకు చూపించి అనుగ్రహించు అని ప్రార్ధించటమే చాలు. ఆయన లోపలా, బయటా ఉన్నాడు. లోపల వసించేది ఆయనే. అంద

భగవంతుడు నిరాకారుడా, సాకారుడా అని తలపోస్తూ తల బ్రద్దలు కొట్టుకోవలసిన అగత్యం ఏముంది... ఏకాంత ప్రదేశంలో మనోవ్యాకులతతో విలపిస్తూ, భగవాన్ నువ్వు ఎలా ఉన్నావో నాకు చూపించి అనుగ్రహించు అని ప్రార్ధించటమే చాలు. ఆయన లోపలా, బయటా ఉన్నాడు. లోపల వసించేది ఆయనే. అందుకే వేదాలు, తత్త్వమసి అని పేర్కొంటున్నాయి. బాహ్యంలోనూ ఆయనే ఉన్నాడు. మాయ వలన నానా రూపాలుగా గోచరమవుతున్నాడు. కాని వాస్తవానికి ఉన్నది ఆయనే. అందుచేతనే నామ రూపవర్ణనకు మునుపు ఓం తత్సత్ అని చెప్పాలి.
 
శాస్త్రాలు అధ్యయనం చేసి ఆయనను తెలుసుకోవటం ఒకటి. ఆయనను దర్శించడమన్నది మరొకటి. శాస్త్రాలలోని జ్ఞానం కేవలం అభ్యాసమాత్రం అంటే అవి కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలవు. కనుకనే అనేక శాస్త్రాలు చదవటం వలన ఏ ప్రయోజనము లేదు. దానికంటే ఏకాంతంలో భగవంతుని ప్రార్ధించటమే మేలు. గీతను పూర్తిగా చదవకపోయినా ఫర్వాలేదు. పదిమార్లు గీతా, గీతా అని పలికితే ఏం వస్తుందో అదే గీతాసారం. గీతా అనేది తాగీ అవుతుంది. అంటే త్యాగీ. ఓ మానవా... సర్వం త్యజించి భగవంతుని ఆరాధించు - ఇదే గీతాసారం.