శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (12:49 IST)

రాఘవేంద్రస్వామి మహిమాన్వితం...

వెంకటనాథుడు క్రీ.శ.1621 దుర్మతి నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ విదియనాడు రాఘవేంద్రస్వామి వారు సన్యాసాశ్రమం స్వీకరించారు. ఆ తరువాత ఆయన తన శిష్య బృందంతో కలిసి అనేక ప్రాంతాలను వెళుతారు. తన భక్తుని కుమారుడు

వెంకటనాథుడు క్రీ.శ.1621 దుర్మతి నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ విదియనాడు రాఘవేంద్రస్వామి వారు సన్యాసాశ్రమం స్వీకరించారు. ఆ తరువాత ఆయన తన శిష్య బృందంతో కలిసి అనేక ప్రాంతాలను వెళుతారు. తన భక్తుని కుమారుడు మామిడి రసం నింపిన గంగాళంలో పడి మరణించినప్పుడు స్వామి మూల రామునిని స్మరించి తన భక్తుని కుమారుని బ్రతికిస్తారు.
  
 
ఎవరి సహాయసహకారాలు అందని ప్రదేశంలో తన భక్తుని భార్య ప్రసవ వేదనతో భాదపడుతుంటే ఆమెకి సుఖప్రసవం కలిగేలా చేస్తారు రాఘవేంద్రస్వామి వారు. పశువుల కాపరి అయిన వెంకన్నను ఆయన ఆశీర్వదించి తన అనుగ్రహ హస్తంతో దివాను అయ్యేలా చేస్తారు. ఓ వ్యక్తి అహంభావాన్ని నశింపజేయడం కోసం ఆ గ్రామంలో యజ్ఞయాగాదులు జరిగేలా చూడడం కోసం రోకలి చిగురించేలా చేస్తారు స్వామివారు. 
 
తన శక్తిని పరీక్షించాలనుకున్న నవాబుకు తగిన విధంగా సమాధామిచ్చి మంచాల గ్రామాన్ని బహుమతిగా పొందుతారు. ఈ ప్రాంతంలోని ప్రజలంతా కరవు కాటకాలతో బాధలు పడుతుంటారు. దాంతో రాఘవేంద్రస్వామి ఆ ప్రాంతంలోనికి వచ్చిన వెంటనే వర్ష ధారలు కురిపించి ఆ ప్రజలను కరవు కాటకాల నుండి కాపాడుతారు.