Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇల్లు శుభ్రంగా ఉండకపోతే.. వాస్తు దోషాలే.. జరజాగ్రత్త..

మంగళవారం, 15 మే 2018 (12:04 IST)

Widgets Magazine

ఇల్లు పరిశుభ్రంగా, అందంగా ఉండాలంటే కొన్ని టిప్స్ తప్పకుండా పాటిస్తే చాలు అవి ఏంటో చూద్దాం... ఇంట్లో దుమ్ము చేరకుండా చూసుకోవాలి. దుమ్ము లేకుండా ఉండాలంటే ఇంట్లో ఎక్కువ సామాన్లు చేర్చకూడదు. బెడ్ రూములో పక్కమీద బట్టలన్నీ చెల్లాచెదురుగా పడేస్తుంటారు కొందరు. అలసిపోయి బెడ్ మీద నడుం వాల్చాలని వచ్చిన వారికి ఆ సీను ఎంతైనా కోపం తెప్పిస్తుంది. అందుకే బెడ్ మీద బట్టలు చిందరవందరగా పడేయకండి. 
 
వంటిల్లు విషయానికి వస్తే ప్లేట్లు, వండిన గిన్నెలను సింకులో ఎక్కువ సేపు ఉంచితే వంటిల్లు శుభ్రంగా ఉండదు. అందుకని ప్లేట్లను, ఎప్పటికప్పుడు కడిగేసి పొడిగుడ్డతో తుడిచి రాక్స్‌లో పెట్టుకోవాలి. మీరు రోజులో ఎక్కువ సేపు గడిపేది లివింగ్‌రూములోనే కాబట్టి గదిలో సహజంగానే దుమ్ము ఎక్కువగా చేరుతుంది. రోజూ రాత్రి పడుకోబోయే ముందుగా లివింగ్ రూమ్‌లోని సోఫాపై, కుర్చీలపై పరిచిన గుడ్డలను బాగా దులపాలి.
 
వారానికొకసారి దిండు కవర్లను మార్చాలి. లివింగ్‌‌రూమ్‌లోని కాఫీ టేబుల్ మీద పడిన కాఫీ మరకలు, టీమరకలు, కూల్‌డ్రింకు వరకలను గుడ్డపెట్టి బాగా తుడిచేయాలి. అంతే కాదు వీధుల్లో నడిచిన చెప్పులతోనే ఇంట్లో నడవొద్దు. ఇలా చేయడం వల్ల హాలులో పరిచిన కార్పెట్ మీద దుమ్ము చేరుతుంది. చెప్పులకంటుకున్న దుమ్ము వల్ల ఫ్లోర్ మీద గీతలు పడే అవకాశం ఉంటుంది.
 
బాత్‍‍‍‍‍‍‍‍‍‍‌రూమూలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సబ్బును స్టాండులో పెట్టకుండా కిందపెట్టేయడం, విడిచిన బట్టలు దండెంమీద అలాగే ఉంచడం, టూత్‌పేస్టు మూత తీసి పక్కనపడేయడం, బాత్‍రూమ్‌ను సబ్బు నురుగుతో వదిలేయడం వంటివి కూడా మంచి అలవాట్లు కావు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో బాత్‌రూమ్‌ను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే రకరకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. 
 
కనీసం రెండు మూడు రోజులకొకసారి బాత్‌రూమ్‌ను శుభ్రంగా కడగాలి. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు బాత్‌రూమ్ గోడలపై సబ్బు, షాంపు మరకలు పడకుండా కడిగేస్తుంటే మీ బాత్‌రూమ్ శుభ్రంగా ఉంటుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇలా శుభ్రం లేని చోట వాస్తు భగవానుడు వుండడని.. అందుకే ఇంటిని శుభ్రంగా వుంచుకోవడం ద్వారా వాస్తు దోషాలను నివృత్తి చేసుకోవచ్చునని వారు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ఇల్లు శుభ్రం గిన్నెలు రోజు లివింగ్‌రూమ్ కుర్చీలు మరకలు Tables House Cleaning Tips Plates Cloth Daily Chairs Living Room

Loading comments ...

భవిష్యవాణి

news

15.5.2018 శనీశ్వర జయంతి.. శంఖుపూవులు సమర్పించి తైలాభిషేకం చేయిస్తే..?

15.5.2018 తేదీ శనీశ్వర జయంతి. మంగళవారం, భరణి నక్షత్రం నాడు శనీశ్వర జయంతి రావడం మంచి ...

news

మంగళవారం (15-05-18) దినఫలాలు... ధనవ్యయం విషయంలో..

మేషం: భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెలకువ వహించండి. ...

news

కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో బంగారు బల్లిని ముట్టుకుంటే?

కంచిలోని బంగారు బల్లి గురించి వినే వుంటారు. బంగారు బల్లిని తాకితే బల్లి దోషాలు ...

news

సోమవారం (14-05-2018) దినఫలాలు - గుర్తింపు - గౌరవం లభిస్తాయి..

మేషం: ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. నూతన వ్యాపారాలు, గృహంలో ...

Widgets Magazine