Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వేసవిలో మీ అతిథులకు వెల్‌కం చెప్పాలంటే? ఇలా చేయండి..

మంగళవారం, 15 మే 2018 (11:58 IST)

Widgets Magazine

వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ఇంటిని గందరగోళంగా తయారుచేస్తారు పిల్లలు. అలాగని వాళ్ల వెంటనే ఉండి సర్దడం సాధ్యంకాదు. ఇలాంటప్పుడే అనుకోకుండా అతిథులు కూడా వస్తారు. వాళ్లను ఎదురుగా పెట్టుకుని అప్పటికపుడు సర్దుతూ కూర్చోలేరు కాబట్టి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే... 
house
 
హాల్లో ఉన్న కర్టెన్ల మీద చున్నీలు లేదా అందమైన డిజైన్లు ఉన్న చీరల్ని అలంకరిస్తే హాల్‌కి స్పెషల్ లుక్ వస్తుంది. హాల్‌ గోడల మీద ఫోటోలకి బదులుగా మంచి సీనరిస్ ఉన్న వాల్ పోస్టర్లను ఉంచాలి. గోడల మీద పెయింట్ పోయినా, పగుళ్లు ఉన్నా వీటిని అతికిస్తే లోపాలు కలిపించవు. హాల్ అందంగా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే హాల్లో ఎక్కువ వస్తువులు పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల హాల్ విశాలంగా కనిపిస్తుంది.
 
ఒకేసారి ఎక్కువమంది అతిథులు వచ్చినప్పుడు కూర్చొనేందుకు సరిపడా కుర్చీలు లేవని ఇబ్బంది పడకూదంటే ఈ టిప్స్ పాలించాలి. హాల్లో ఉన్న కుర్చీలన్నీ తీసేసి పరుపు పరిచేయండి. వచ్చిన వాళ్లు కింద కూర్చుంటే ఏ ఇబ్బంది ఉండదు. పరుపు కాకపోతే చాప లేదా కార్పెట్ వేసి దానిమీద డబుల్‌షీట్ క్లాత్‌ను వేయెుచ్చు.
 
చాలామంది ఏం చేస్తారంటే అతిథులు వచ్చినప్పుడు ముందుగా ఫ్యామిలీ ఆల్బమ్స్‌ని చూపిస్తుంటారు. అలాచేయకుండా మంచి విషయాలను మాట్లాడుకుంటే సంతోషంగా ఉంటుంది. అలా ఫోటోలు చూడడం వల్ల అతిథులతో మాట్లాడే అవకాశం దొరకదు. సంభాషణ ఎక్కువగా జరగడం వలన వాళ్ల గురించి మరి కొన్ని మంచి విషయాలను తెలుసుకోవచ్చు. మీరు చెప్పాల్సిన విషయాలను మాట్లాడవచ్చు అప్పుడే తెలియని వారు గురించి బాగా తెలుసుకోవచ్చు.
 
అతిథులు వస్తున్నారనే విషయం ముందుగానే తెలిస్తే పూలతో అలంకరణ చేస్తే బాగుంటుంది. చిన్నచిన్న అలకరణలతో పాటు ఆహ్లాదకరమైన సువాసనలు వెదజల్లే రూమ్ ఫ్రేషనర్స్ వాడొచ్చు. సుగంధ పరిమళాలు వెదజల్లే అగరొత్తులను వెలిగించినా అందంగా ఉంటుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

గ్లోయింగ్ స్కిన్ కోసం గుమ్మడికాయ ఫేస్ ప్యాక్? ఎలా?

ఫేస్ మాస్క్లను తయారు చేయడానికి ఉపయోగించే వాటిలో మూలపదార్థంలో చాలా రకాల పండ్లు కూరగాయలు ...

news

జుట్టు పెరగడానికి బేకింగ్ సోడాను తీసుకుంటే? ఎలా? ఎందుకు?

కొంతమంది ముఖంపై తీసుకున్న శ్రద్ధ జుట్టుపై తీసుకోరు. ఐతే కేశాలకు కూడా ...

news

భూమి మీద నడయాడే దేవత అమ్మ... (మహేష్-రాశి ఖన్నా-షాలినీ పాండే) హేపీ మదర్స్ డే

భూమి మీద నడయాడే అమ్మ దేవతలను గుర్తు చేసుకునేందుకు ఒక వేడుక ఉండాలని కొందరు చేసిన ప్రయత్నాల ...

news

వేసవిలో కమిలిన చర్మాన్నికి ఈ చిట్కాలతో చెక్..

మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాసుకున్న తరువాత నెమ్మదిగా మసాజ్ చేసినట్లైతే కమిలిన ...

Widgets Magazine