బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 12 మే 2018 (14:19 IST)

రంగస్థలం, మహానటి, ఇరుంబుతిరై.. హ్యాట్రిక్‌.. చాలా హ్యాపీ: సమంత ట్వీట్

టాలీవుడ్ అగ్రనటి సమంత వరుస విజయాలతో దూసుకుపోతుంది. 2016లో విడుదలైన అ..ఆ, జనతా గ్యారేజ్, రాజుగారి గది2, మెర్సల్, రంగస్థలం వంటి సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. తాజాగా మహానటి కూడా ఆమె ఖాతాలో విజయా

టాలీవుడ్ అగ్రనటి సమంత వరుస విజయాలతో దూసుకుపోతుంది. 2016లో విడుదలైన అ..ఆ, జనతా గ్యారేజ్, రాజుగారి గది2, మెర్సల్, రంగస్థలం వంటి సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. తాజాగా మహానటి కూడా ఆమె ఖాతాలో విజయాన్ని చేర్చింది.


తాజాగా విశాల్‌ సరసన సమంత నటించిన ''ఇరుంబుతిరై'' (తెలుగులో అభిమన్యుడు) సినిమా కూడా త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సమంత హ్యాట్రిక్ ట్వీట్ చేసింది. తనకు ఉత్తమమైన వేసవిని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. 
 
ఇంకా రంగస్థలం, మహానటి, ఇరుంబుతిరై.. హ్యాట్రిక్‌ అంటూ తెలిపింది. అధికారికంగా తాను ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా వున్న అమ్మాయినని ట్వీట్‌ చేశారు. ఇంకా పోస్టర్‌ను కూడా పంచుకున్నారు.

ఇకపోతే.. సమంత ప్రస్తుతం 'యూటర్న్' రీమేక్‌లో నటిస్తోంది. తమిళ హీరో విజయ్‌ సేతుపతితో కలిసి ఆమె నటించిన ''సూపర్‌ డీలక్స్‌'' కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ఆమె శివ కార్తికేయన్‌కు జోడీగా ''సీమరాజ'' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కాబోతోంది.
 
ఇదిలా ఉంటే, సావిత్రి జీవిత కథా చిత్రం 'మహానటి'లో ఆవిడ జీవిత చరిత్రను విశదీకరించే జర్నలిస్టు పాత్రలో సమంత నటించిన తీరును, మహానటిలో నటించిన ఇతర తారాగణాన్ని అక్కినేని నాగార్జున ప్రశంసించగా, అందుకు కృతజ్ఞతలు చెప్పింది సమంత. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ "థ్యాంక్యూ మామా... లవ్ యూ" అని ఓ పోస్టును పెడుతూ, నమస్కార ఎమోజీలను ఉంచింది.