Astrology Zodiac Pisces Lnum.htm

Notifications

మీనం మీనం
లక్కీ నెంబర్

వీరి అదృష్ట సంఖ్యలు 3, 7. వీటితోపాటు 12, 21, 30, 48, 57, 66, 75 సంఖ్యలు 16, 25, 34, 43, 52, 61, 70... సంఖ్యలు కూడా కలిసివచ్చే సంఖ్యలే. అయితే 5, 6 మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి.

జూన్ 26, 2026 శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్

జూన్ 26, 2026 శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 30-40 కి.మీ వేగంతో) కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 30°C నుంచి 32°C వరకు, కనిష్ట ఉష్ణోగ్రత 25°C గా నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ : వాతావరణం: ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాలలో ఆకాశం కారుమబ్బులతో కమ్ముకుని ఉంది. శుక్ర, శనివారాల్లో చాలా చోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియో

ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియోనన్ను చాలామంది గుంపుమేస్త్రి అని అవహేళన చేస్తుంటారు, నిజమే నేను గుంపుమేస్త్రీనే అని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ... నన్ను గుంపుమేస్త్రీ అని ఎంతమంది అవహేళన చేసినా పట్టించుకోను. ఎందుకంటే నేను నిజంగానే గుంపుమేస్త్రీని. మంత్రులు, ప్రజలతో కూడిన గుంపుకి నేను మేస్త్రీని. ఈ గుంపే నాకు బలం. కార్యకర్త స్థాయి నుంచి వార్డ్ మెంబర్, జిల్లాస్థాయి ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. నన్ను అందరూ రేవంతన్న అంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నేనేమి మారలేదు. నేను గుంపుమేస్త్రీనే. కొందరు గొప్పలు చెప్పుకుంటుంటారు.

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబు

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబుకర్ణాటకలోని హోస్పేటలో ఉన్న తుంగభద్ర డ్యామ్ వద్ద, కొత్తగా ఏర్పాటు చేసిన స్పిల్‌వే గేట్ల అధికారిక ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ పాల్గొన్నారు. ఆగస్టు 2024 వరదల సమయంలో డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన తర్వాత, ఒక నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రూ.51 కోట్ల వ్యయంతో 33 కొత్త క్రెస్ట్ గేట్లను ఏర్పాటు చేసే భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తూ.. సాగునీరు, నీటి పారుదల ప్రాజెక్టులను దేశ ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు వీటిని పరిరక్షించడం భావి తరాల భవిష్యత్తుకు అత్యంత కీలకమని పునరుద్ఘాటించారు.

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...వారాల్లో శుక్రవారం అనగానే మహాలక్ష్మిని ఆవాహనం చేస్తుంటారు. ఆ లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టాలని కోరుకుంటుంటారు. ఎందుకంటే.. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో అమ్మవారిని పూజించి, క్రింది శ్లోకాలను పఠించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు సిద్ధిస్తాయి. శుక్రవారం పఠించాల్సిన కొన్ని ముఖ్యమైన లక్ష్మీ శ్లోకాలు, మంత్రాలు తెలుసుకుందాము. మహాలక్ష్మీ అష్టకం (అత్యంత శక్తివంతమైన శ్లోకం) లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం ఈ శ్లోకాన్ని కనీసం 3 లేదా 9 సార్లు పఠించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే | శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ||

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు