ఏపీలో పాఠశాలల్లో విద్యార్థుల ప్రార్థనలు రద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇకపై పాఠశాలల్లో ఉదయం పూట ప్రార్థనలు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, స్కూల్స్‌లలో క్రీడా పోటీలు కూడా నిర్వహించవద్దని కోరింది.
ముఖ్యంగా, విద్యార్థులను తరగతి గదుల్లో భౌతికదూరం పాటించేలా కూర్చోబెట్టాలని, పాఠశాల ప్రాంగణంలో ఎక్కడా కూడా గుమికూడకుండా చూడాలని ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని కోరింది.
అలాగే పాఠశాల గదులను, ఆవరణను ఎప్పటికపుడు శానిటైజ్ చేయాలని ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుండాలని కోరింది. అదేసమయంలో విద్యార్థులు ఎవరైనా కరోనా వైరస్ బారినపడితే తక్షణం చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.