ప్చ్.. పవన్ 2 చోట్లా పరాజయం... జనసేన జనంలో ఎందుకు ఓడింది?

pawan kalyan
Last Modified గురువారం, 23 మే 2019 (19:26 IST)
జనసేన... పార్టీ పెట్టినప్పుడు వున్న ఊపు ఆ తర్వాత క్రమంగా జావగారిపోయింది. పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పుతారు అనుకుంటే ఫ్యాను చక్రం గాలికి కొట్టుకుని పోయారు. ఆ పార్టీ చిరునామా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఐతే పవన్ కల్యాణ్ స్వతహాగా చేసిన కొన్ని తప్పిదాలే ఆయన పార్టీ ఓటమికి కారణాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

1. ఇతర పార్టీల నుంచి అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులు వస్తామంటే వద్దని చెప్పేయడం.

2. ఎన్నికల సమయానికి కనీసం అభ్యర్థులను అన్ని నియోజకవర్గాల్లో ప్రకటించలేకపోవడం.

3. బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకోడం వల్ల అప్పటివరకూ పార్టీకి అంటిపెట్టుకుని వున్న కొందరు ఓటర్లు జనసేనకు దూరమయ్యారు.

4. చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి విధానాలను సరిగా టార్గెట్ చేయలేకపోవడం.

5. సీఎం సీటు అవసరం లేదని ఒకసారి... ఓట్లు వేస్తే ముఖ్యమంత్రినవుతానంటూ మరోసారి చెప్పడం.
pawan kalyan

ఇలా ఒక్కొక్కటిగా కలిసి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఘోర పరాజయానికి కారణమయ్యాయి. ఒక దశలో పవన్ కల్యాణ్ జనసేనకు కనీసం 40 నుంచి 50 స్థానాలు ఖాయమనే వాదన వచ్చింది. అలాంటిది ఎన్నికల సమయానికి బీఎస్పీ, వామపక్షాలతో దోస్తీ కట్టి రెంటికీ చెడ్డ రేవడిలా మారిపోయింది జనసేన. పార్టీ నాయకుడే ఎన్నికల్లో గెలవలేని ప్రస్తుత స్థితిలో జనసేన పార్టీని పవన్ కల్యాణ్ ఎలా నడుపుతాడన్నది చూడాల్సి వుంది.దీనిపై మరింత చదవండి :