'అన్నయ్య' పొలిటికల్ కన్‌క్లూజన్ తీసుకున్నారు: క్లారిటీ ఇచ్చిన 'తమ్ముడు'

chiranjeevi with pawan kalyan
Last Updated: గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:15 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో అన్నయ్య - తమ్ముడు అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది మెగాస్టార్ - పవర్ స్టార్. వీరిద్దరూ అన్నయ్య, తమ్ముడు పేర్లతో సినిమాలు కూడా చేశారు. ఈ చిత్రాలు కూడా మంచి హిట్ కొట్టాయి.

అయితే, రాజకీయాల్లోకి తొలుత అన్నయ్య వచ్చారు. ప్రజారాజ్యం పెట్టారు. 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. 18 సీట్లతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆయన మాత్రం రాజ్యసభ సభ్యుడుగా ఎంపికై కేంద్ర మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇపుడు పవర్ స్టార్ జనసేన పార్టీని స్థాపించారు. ఏపీ రాజకీయాల్లో ఓ ఊపు ఊపుతున్నారు. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో ఆయనతో పాటు.. ఆయన పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దించారు. వీరి తరపున అన్నయ్య చిరంజీవి ప్రచారానికి వస్తారంటూ ప్రచారం జరిగింది. దీనిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.

"జనసేన పార్టీ తరపున ప్రచారానికి అన్నయ్య వచ్చే అవకాశం లేదు. ఆయన పొలిటికల్ కన్‌క్లూజన్ ఆయన తీసేసుకున్నారు. పాలిటిక్స్‌ను నేను చూసే విధానం వేరు.. ఆయన చూసే విధానం వేరు. ఆ విషయంలో మా ఇద్దరి మధ్య స్పష్టత ఉంది. ఆయన కళాకారుడు.. నేను కళాకారుడిని కాదు. అంతే తేడా" అని పవన్ వివరించారు. సో.. జనసేన తరపున చిరంజీవి ప్రచారం చేయరనే విషయంపై క్లారిటీ వచ్చింది.దీనిపై మరింత చదవండి :