నా భర్త సత్తా నాకు తెలుసు.. అన్ని సీట్లు గ్యారంటీ: వై.ఎస్.భారతి

ys bharati
జె| Last Modified శనివారం, 6 ఏప్రియల్ 2019 (14:02 IST)
ఎన్నికలు సమీపించాయి. పోలింగ్‌కు మరో 4 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని కూడా జోరుగా సాగిస్తున్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తరపున విజయమ్మ, షర్మిళలు ఇద్దరూ కలిసి ప్రచారం చేస్తున్నారు. జగన్ కూడా 13 జిల్లాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్ తరపున ఆయన సతీమణి వై.ఎస్. భారతి అసలు ప్రచారం చేయలేదు. కానీ మొదటిసారి భర్త గెలుపు కోసం ఆమె ప్రచారం చేస్తున్నారు.

అది కూడా కడప జిల్లా పులివెందులలో. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్థి చేసుకోండి అంటూ వై.ఎస్. భారతి చెబుతూ ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్‌ను చేతిలో పట్టుకుని మరీ ప్రచారం చేస్తుండడంతో ఓటర్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వై.ఎస్. భారతి ప్రచారంలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే తన భర్తకు సిఎంగా గెలిచే అవకాశం ఉందని, ఆయనలో ఆ సత్తా కూడా ఉందని, సర్వేల్లో 125 సీట్లకు పైగా వస్తాయని చెబుతున్నారని, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వై.ఎస్. భారతి.దీనిపై మరింత చదవండి :