శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (10:00 IST)

లోకజ్ఞానం లేని జో(లో)కేశ్.. దేశంలో 28 రాష్ట్రాలేనట..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ మరోమారు తనకు లోకజ్ఞానం లేదని నిరూపించారు. ఒక రాష్ట్ర మంత్రిగా, ఏకంగా మూడు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న ఆయనకు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కూడా తెలియలేదు. తన ఎన్నికల ప్రచారంలో ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా ప్రసంగాలు చేస్తుండటం వల్ల నవ్వులపాలవుతున్నారు. 
 
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో తనను గెలిపించాలని ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆదివారం మంగళగిరి నియోజకవర్గ ప్రచారం చేశారు. అపుడు ఆయన మాట్లాడుతూ, దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయంటూ పప్పులో కాలేశారు. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కూడా తెలియని నాయకుడు మంత్రి అయ్యాడంటూ నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. 
 
గతంలో ఏపీతో పాటు.. తెలంగాణా రాష్ట్రాల్లో పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీన జరుగనుంది. కానీ, లోకేశ్ మాత్రం 9వ తేదీన జరిగే పోలింగ్‌లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ తడబడిన విషయం తెల్సిందే. అలాగే, శనివారం చేసిన ప్రచారంలో మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు బదులు మార్చి 23న ఓట్ల లెక్కింపు ఉందంటూ మరోసారి నోరుజారారు.