మీ ఓటు మాకు.. ఈ చెట్టు మీకు

tdp logo
Last Updated: శనివారం, 30 మార్చి 2019 (12:54 IST)
ఎన్నికల సమయంలో ఎన్నో చిత్రవిచిత్ర దృశ్యాలు చూస్తుంటాం. కొందరు నేతలు వినూత్న తరహాలో ప్రచారం చేస్తుంటారు. కొందరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తారు. ఇంకొందరు తమ చేతలో ఓటర్లను ఆకర్షిస్తుంటారు. ఇలాంటి వారిలో తిరుపతిలో టీడీపీ నేత అజయ్ ప్రతాప్ ఒకరు. ఈయన వినూత్న తరహాలో ప్రచారంలో చేశారు.

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సుగుణమ్మ గెలుపుకోసం ఆమె తరపున సీనియర్ నేత అజయ్ ప్రతాప్ ఆధ్వర్యంలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తిరుపతి ఆటోనగర్‌లో ఇంటింకి తిరుగుతూ చెట్లు పంచుతూ ఓట్లు అడిగారు.

ఈ చెట్టు మీకు.. మీ ఓటు మాకు అంటూ ఆయన ఓటర్లకి విజ్ఞప్తి చేశారు. చెట్లు పర్యావరణ పరిరక్షణకు.. టీడీపీ సమాజ పరిరక్షణకు... మీ ఓటు టీడీపీకే వేయాలంటూ ఆయన ప్రాదేయపడ్డారు. అజయ్ ప్రతాప్ ప్రచారానికి ఓటర్ల నుంచి అమితమైన స్పందన వస్తోంది.దీనిపై మరింత చదవండి :