సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (17:57 IST)

షేక్ హ్యాండ్ ఇచ్చిన షర్మిల.. ఉంగరాన్ని గుంజుకున్న దొంగ(Video)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో ఆయన సోదరి వైఎస్. షర్మిల, తల్లి వైఎస్. విజయమ్మ, భార్య వైఎస్ భారతిలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నలుగురు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. 
 
ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం వీరంతా తమవంతు కృషి చేస్తుంటే దొంగలు మాత్రం తమపనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభిమానులకు వైఎస్ షర్మిల షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలో ఒక దొంగ ఏకంగా ఆమె ఉంగరాన్ని గుంజుకున్నాడు. 
 
మూడురోజుల క్రితం ఏపీలో ప్రచారాన్ని మొదలుపెట్టిన షర్మిల ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె వాహనంలో నుంచి అభిమానులకు అభివాదం చేస్తుండగా.. కార్యకర్తలు ఆమెతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. ఆమె కూడా నవ్వుతూ వారికి చేతులు అందిస్తూ షేక్‌హ్యాండ్ ఇచ్చారు. 
 
అదే అదునుగా భావించిన ఓ దొంగ కార్యకర్త ఆమె చేతి ఉంగరంపై గురిపెట్టాడు. ఇంకేమున్నది.. చెయ్యి అందగానే ఆమె వేలికి ఉన్న ఉంగరాన్ని బలవంతంగా లాగాడు. షర్మిల కూడా ఉంగరాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ దృశ్యాలన్నీ ఒక వ్యక్తి కెమెరాలో బంధించి.. సోషల్ మీడియాలోకి వదలడంతో వైరల్ అయింది. వీడియో...