గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 మే 2024 (12:04 IST)

ఎన్నికల వేళ భారీగా నగదు పట్టివేత .. రూ.8.40 కోట్ల!!

cash
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా నగదు పట్టుబడుతుంది. రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పోలీసులు పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్ల నగదును సీజ్ చేశారు. జగ్గయ్యపేట మండలం గురికపాడు చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు హైదరాబాద్ నుంచి గుంటూరుకు లారీలో తరలిస్తుండగా ఈ డబ్బును పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
స్టార్ డమ్‌కు ఓట్లు పడవు... కూటమి కోసం త్యాగాలు చేశాం : పవన్ కళ్యాణ్ 
 
సినీ నేపథ్యం, సినీ పాపులారిటీ, స్టార్ డమ్ వంటి అంశాలకు ఓట్లు పడవని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తనకున్న సినీ ఇమేజ్‌తో ఓట్లు బదిలీకావన్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవున్న పవన్ కళ్యాణ్‌ తాజాగా ఓ జాతీయ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలపై స్పందించారు. రాజకీయాల్లో నిలకడ, స్థిరత్వం ఒక్కటే విజయాన్ని అందిస్తుందన్నారు. 
 
భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు. కానీ, హిందుత్వంవైపు కాస్త మొగ్గు చూపుతుందన్నారు. ఇదే విషయాన్ని తాను ముస్లిం సోదరులకు పలుమార్లు చెప్పానని తెలిపారు. దేశ నిర్మాణంలో బీజేపీ చాలా కీలక పాత్రను పోషిస్తుందని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణకు తగిన చర్యలు వారు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. 
 
బీజేపీకి ఏ వర్గం మీద వివక్ష, ద్వేషం లేవని ఇక్కడ కూడా తానెప్పుడూ చూడలేదని గుర్తు చేశారు. ఐదేళ్ల క్రితం బీజేపీ, టీడీపీతో విడిపోయిన తర్వాత మళ్లీ కూటమిగా ఏర్పడటానికి తన పార్టీ తరపున ప్రత్యేక త్యాగాలు చేయాల్సివచ్చిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఫలితంగానే ఇపుడు ఏపీలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ఏర్పడిందన్నారు. కొన్ని దుష్టశక్తులను అంతం చేయాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.