సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2022 (19:15 IST)

ఒక్కసారిగా పడిపోయిన టమోటా ధరలు.. కిలో రెండు రూపాయలే

Tomato
టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఒక్కసారిగా టమోటా ధరలు రెండు రూపాయలకు పడిపోయాయి.  కూలీ ఖర్చు కూడా గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు. 
 
మార్కెట్‌కు తెచ్చిన పంటను అమ్మలేక తిరిగి తీసుకెళ్లలేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాట ధర దారుణంగా పడిపోయింది. 
 
ఈ మార్కెట్ నుంచే తెలుగు రాష్ట్రాలకు టమోటా ఎగుమతి అవుతోంది. దీంతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు  టమోటా ఎగుమతి అవుతోంది.  ఈ నేపథ్యంలో టమోటా ధరలు రోజు రోజుకీ పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.