గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2020 (23:34 IST)

పార్టీనేతల కోసం ప్రత్యేకంగా ‘జగనన్న జేబు కత్తెర’: టీడీపీ

జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రంలో ‘జగనన్నజేబుకత్తెర’ అనే పేరుతో సరికొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చాడని, దాన్ని ప్రత్యేకంగా వైసీపీ కార్యకర్తలు, నేతలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకోసమే అమలుచేస్తున్నారని, సదరు పథకం అమల్లో మంత్రి గుమ్మనూరు జయరామ్ అందరికంటే ముందున్నాడని టీడీపీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు.

ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ...! జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా వైసీపీకార్యకర్తలు, నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకోసం (ఓన్లీఫర్ వైసీపీ) ‘జగనన్న జేబు కత్తెర’ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. అధికారపార్టీకి చెందినవారు ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా అమలుచేస్తున్నారు. రాష్ట్ర ప్రజల జేబులు కత్తిరించి, ఎప్పుడు పడితే అప్పుడు అందినకాడికి దోచుకోవడమే జగనన్న జేబుకత్తెర పథకం యొక్క ముఖ్య లక్ష్యం.

ఆ పథకం లోగోకూడా కత్తెరె... దానికి కూడా వైసీపీరంగులేఉంటాయి. ఈ పథకంలో మంత్రి గుమ్మనూరు జయరామ్ అందరికంటే ముందున్నాడు. బెంజ్ కారులు గిఫ్ట్ గా తీసుకోవడం, 200ఎకరాల భూమిని దోచుకోవడం ద్వారా మంత్రి గుమ్మనూరు జయరామ్ జగనన్న జేబుకత్తెర పథకానికి సార్థకత చేకూర్చారు. అవినీతి పరులతోలుతీస్తా... తాటతీస్తా... అవినీతిని సహించను... అని చెప్పే జగన్మోహన్ రెడ్డి మంత్రి గుమ్మనూరు అవినీతిపై ఏం చర్యలు తీసుకున్నారు? 

ఆయన పెట్టిన కాల్ సెంటర్ కు ఫోన్  చేస్తే, ఎవరూ పట్టించుకోవడం లేదు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఫోన్ చేసి జయరామ్ అవినీతిపై ఫిర్యాదుచేస్తే, ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? లక్షలకోట్లు కాజేసిన జగన్మోహన్ రెడ్డి, అవినీతి గురించి మాట్లాడినప్పుడే ప్రజలకు అనుమానం వచ్చింది... ఏమిటి ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతున్నాడని.  అడిగేవాడెవడూ లేడన్నట్లు వైసీపీ వారు దోచుకోవడంలో పేట్రేగిపోతున్నా, ముఖ్యమంత్రి చూస్తూనే ఉన్నారు. 

మంత్రి  గుమ్మనూరు జయరామ్ తన సొంత నియోజకవర్గంలో, ఆస్పరి గ్రామంలోని 203ఎకరాల రైతులభూమికి సంబంధించి, తప్పుడు పత్రాలు సృష్టించి, తనకుటుంబసభ్యులు, బినామీల పేరుతో మార్చుకున్నారు.  ఇందులో మంత్రి తప్పుచేశాడని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇత్తిన ప్లాంటేషన్స్ లో డైరెక్టర్ గా ఉన్న మంజునాథ్ మూడేళ్లు మాత్రమే కొనసాగి, 2009లోనే తన డైరెక్టర్ పదవికి రాజీనామాచేశారు. 

ఇత్తిన ప్లాంటేషన్స్ తో ఏమాత్రం సంబంధంలేని మంజునాథ్ ని అడ్డుపెట్టుకొని, 11-12-2019న మంత్రి జయరామ్ తప్పుడు బోర్డ్ రిజల్యూషన్ తయారుచేశారు.