శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 నవంబరు 2020 (07:57 IST)

10వ తరగతి విద్యార్థులు 50 శాతం హాజరు: విద్యాశాఖ మంత్రి సురేష్

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకు పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. "ఈ నెల 2వ తేదీన పాఠశాలలు తెరవగా 6వ తేదీ నాటికి క్రమేణా హాజరు పెరుగుతుంది.

ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. శుక్రవారం 49.63 శాతం 10వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులు 38.29 శాతం హాజరు కాగా, 89.86 శాతం ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారు. మొత్తంగా విద్యార్థుల హాజరు 43.88కి చేరింది. 
 
గత నాలుగు రోజులు హాజరు పరిశీలిస్తే 2వ తేదీన 42 శాతం విద్యార్థులు, 3న 33.69 శాతం విద్యార్థులు హాజరవ్వగా 4వ తేదీన 40.30 శాతం, 5వ తేదీ 35 శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. 6న హాజరు శాతం 43.89కి చేరింది. 
 
కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు బయటపడుతుండగా వారిని హోమ్ ఐసొలేషన్ లో ఉంచి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాం. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు టెస్ట్ లు చేస్తున్నారు. కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్ లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

విద్యార్థుల ఆరోగ్యమే ప్రధాన ద్యేయంగా అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం.

పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. మాస్క్, శానిటైజేషన్ విషయాల్లో రాజీపడేది లేదు" అని వివరించారు.