మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

గంజాయి మత్తులో వరంగల్ నీట్ విద్యార్థులు... 11 మంది సస్పెండ్

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థ వరంగల్ నిట్. ఇందులో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు గంజాయి మత్తులో తూగుతున్నారు. ఈ విషయం తెలిసిన యాజమాన్యం 11 మంది విద్యార్థులపై చర్యలు తీసుకుంది. 
 
ఇక్కడ విద్యాభ్యాసం చేసే విద్యార్థులు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో స్పందించిన నిట్ అధికారులు గత నెల 27న హాస్టల్ గదుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. 
 
ఈ వ్యవహారంపై డీన్ నేతృత్వంలో విచారణ జరిపిన కమిటీ పట్టుబడిన 11 మంది విద్యార్థులు గంజాయి తాగినట్టు నిర్ధారించి నివేదిక సమర్పించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన నిట్ అధికారులు 11 మంది విద్యార్థులను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వేటు పడిన 11 మంది విద్యార్థుల్లో 9 మంది విదేశీ విద్యార్థులు కావడం గమనార్హం.