గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (16:07 IST)

హైదరాబాద్ వాసులకు షాక్.. భద్రతా కారణాలతో ప్యాసింజర్ రైళ్లు రద్దు

హైదరాబాద్ నగర వాసులకు దక్షిణ మధ్య రైల్వే తేరుకోలేని షాకిచ్చింది. భద్రతా కారణాలు చూపి ఏకంగా 13 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. ఈ విషయాన్ని దక్షణ మధ్య రైల్వే తాజాగా వెల్లడించింది. ఫలితంగా దాదాపు ఆరు నెలల పాటు ఈ సేవలు కనుమరుగు కానున్నాయి. 2020 జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది.
 
ప్రస్తుతం రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్ల వివరాలను పరిశీలిస్తే, 1. సికింద్రాబాద్ - మేడ్చల్ - సికింద్రాబాద్, 2. సికింద్రాబాద్ - మనోహరాబాద్ - సికింద్రాబాద్, 3. ఫలక్‌నుమా - మేడ్చల్ - ఫలక్‌నుమా, 4. ఫలక్‌నుమా - ఉందానగర్ - ఫలక్‌నుమా, 5. ఫలక్‌నుమా - మనోహరాబాద్ - సికింద్రాబాద్, 6. బొల్లారం - ఫలక్‌నుమా ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. 
 
వీటితోపాటు ఇతర రూట్లలో తిరిగే 12 డెమూ ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే సంస్థ.. ప్రత్యామ్యాయాల్ని విస్మరించింది. దీంతో.. ప్రయణికులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా.. రైల్వే స్టేషన్స్‌లో కూడా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.