మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (18:47 IST)

న్యాయ విద్యార్థినిపై లాయర్ అత్యాచారం.. ఎక్కడ?

తన వద్ద శిక్షణ పొందుతున్న ఓ న్యాయ విద్యార్థినిపై కీచకుడైన ఓ లాయర్ అత్యాచానికి తెగబడ్డాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశం రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బరేలీ జిల్లాకు చెందిన 21 యేళ్ల న్యాయ విద్యార్థిని ఈ నెల 15వ తేదీన తాను శిక్షణ పొందుతున్న లాయర్ చాంబర్‌కు వెళ్లింది. ఆ సమయంలో చాంబర్‌లో ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన లాయర్.. ఆ న్యాయ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత తనకు జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పి కన్నీమున్నీరైంది. ఆ తర్వాత యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నాం. నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ఆపరేషన్‌ ప్రారంభించామని బహెడి ఎస్‌హెచ్‌వో పంకజ్‌ పంత్‌ తెలిపారు. 
 
బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు 
ఇదిలావుంటే, ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ కుమారుడు హజారీ సింగ్‌పై కేసు నమోదైంది. హజారీ సింగ్‌ 10 మంది అనుచరులతో కలిసి తనను కులం పేరుతో దూషిస్తూ, కొట్టారని రెవెన్యూ అధికారి రాధేశ్యామ్‌ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. 
 
ఫిర్యాదుతో హజారీ సింగ్‌పై ఐపీఎస్‌ సెక్షన్‌‌లోని ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు బైరియా ఎస్‌హెచ్‌వో సంజయ్‌ త్రిపాఠి తెలిపారు. బైరియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సురేంద్రసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారనే విషయం తెలిసిందే.