శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (08:01 IST)

3.30 గంటల్లో సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ!

కాజీపేట-విజయవాడ మధ్య సీవోసీఆర్‌ (కన్‌ఫర్మేటరీ ఆస్కిలోగ్రాఫ్‌ కార్‌ రన్‌) రైలు పరుగు విజయవంతమైంది. 135 కి.మీ. గరిష్ఠ వేగంతో 24 బోగీలతో ఉదయం 10:30 గంటలకు కాజీపేటలో ప్రారంభమైన రైలు మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడ చేరుకుంది.

ప్రస్తుతం కాజీపేట నుంచి విజయవాడకు 3-3.5 గంటలు పడుతోంది. రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110 కి.మీ. రాజధాని రైళ్ల వేగం మాత్రం 120 కి.మీ. తాజా పరీక్ష నేపథ్యంలో గంటకు 135 కి.మీ. గరిష్ఠ వేగంతో రైలు వెళితే సికింద్రాబాద్‌ నుంచి కాజీపేటకు గంటన్నరలో చేరుకోవచ్చు.

కాజీపేట నుంచి విజయవాడకు 2 గంటల్లో వెళ్లొచ్చని అధికారులు చెబుతున్నారు. కొన్ని అవరోధాలు తొలగిస్తే సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు 3.30 గంటల్లో చేరుకోవచ్చు.

ఇప్పుడు దాదాపు ఐదున్నర గంటల సమయం పడుతోంది. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు రెండు మార్గాలున్నాయి.

ఒకటి కాజీపేట, వరంగల్‌ మీదుగా.. రెండోది నడికుడి మీదుగా. ప్రస్తుతం సికింద్రాబాద్‌ - కాజీపేట - విజయవాడ మార్గం (350 కిలోమీటర్లు)లో రైల్వే ట్రాక్‌ సామర్థ్య పరీక్షలు పూర్తయ్యాయి.