బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (18:02 IST)

సింహాద్రి ఎన్టీపీసీలో ప్రమాదం.. ముగ్గురి మృతి

ntpc plant
విశాఖపట్టణంలోని సింహాద్రి ఎన్టీపీసీ ఎఫ్ జీడీ నిర్మాణ పనుల్లో చిన్నపాటి అపశృతి చోటుచేసుకుంది. బెల్ట్ తెగిపోవడంతో కార్మికులు 15 మీటర్ల ఎత్తు నుంచి కిందపడ్డారు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ఎన్టీపీసీ ఎఫ్ జీడీలో నిర్మాణ పనులు జరుగుతుండగా కేబుల్ ట్రాక్ బెల్ట్ తెగిపోయింది. దీంతో నిర్మాణ పనుల్లో నిమగ్నమైనవారు 15 మీటర్ల ఎత్తు నుంచి కిందపడిపోయారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారు. వీరిని వెస్ట్ బెంగాల్ కార్మికులుగా గుర్తించారు.