మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (17:53 IST)

కడప జిల్లాలో క్షణాల్లో 4 అంతస్తుల భవనం కూల్చివేత

కడప జిల్లాలో నాలుగు అంతస్తుల భవనం ఒకటి పేకమేడలా కూలిపోయింది. అండర్ గ్రౌండ్ బిల్డింగ్ నిర్మించేందుకు పక్కింటి వ్యక్తి పునాదులు తవ్వడంతో ఆ నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్టుండి పక్కకు ఒరిగిపోయింది. దీంతో స్థానికులు ఖంగుతిన్నారు. 
 
ఈ ఘటన జిల్లాలోని రైల్వే కోడూరు అయ్యప్ప ఆలయం ఎదురుగా జరిగింద. ఈ ప్రాంతానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ఇటీవల రూ.60 లక్షల వ్యయంతో నాలుగు అంతస్తుల్లో ఒక భవనాన్ని నిర్మించుకున్నాడు. అయితే, అదే ఇంటి పక్కన ఉన్న వెంకటరామరాజు అనే వ్యాపారి కూడా అండర్ గ్రౌండ్ భవనం నిర్మించడానికి 15 అడుగులు మేరకు పునాదులు తీశాడు. 
 
దీంతో నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం ఏర్పడలేదు. దీంతో కుంగిపోయిన ఇంటితోపాటు.. స్థలాన్ని కూడా వెంకటరామరాజు కోటి రూపాయలు కొనుగోలు చేసి బాధితుడికి న్యాయం చేశాడు. ఆ తర్వాత ఆ భవాన్ని క్షణాల్లో కూల్చివేశారు.