మతిస్థిమితం లేని మనవరాలిపై అత్యాచారం.. గర్భవతి...

Last Updated: శుక్రవారం, 15 మార్చి 2019 (14:18 IST)
సభ్యసమాజం తలదించుకునే ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో జరిగింది. 60 యేళ్ల వృద్ధుడు కామంతో కళ్లుమూసుకునిపోయి 16 యేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతకీ ఈ మతిస్థిమితం లేని యువతి. పైగా ఆ వృద్ధుడుకి మనవరాలి వరుస. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

మండలంలోని ఎం.ఉప్పలూరు గ్రామానికి చెందిన జి.పుల్లయ్య (60) వరుసకు మనవరాలు అయ్యే ఓ యువతి (16)పై కన్నేశాడు. మతిస్థిమితం లేకపోవడంతో ఆ బాలికను దగ్గరకు చేరదిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ నేపథ్యంలో ఆ బాలిక ఇటీవల అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ యువతిని పరీక్షించిన వైద్యులు ఆమె ఆరో నెల గర్భవతి అని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులు నిలదీయగా తానే లైంగికదాడికి పాల్పడ్డానని పుల్లయ్య అంగీకరించాడు.

ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. యువతిని వైద్య పరీక్షల కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



దీనిపై మరింత చదవండి :