శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (22:33 IST)

ఏపీలో 8,732 కరోనా పాజిటీవ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడ‌చిన 24 గంటల్లో కొత్తగా 8,732 కరోనా కేసులు నమోదయ్యాయి. 87 మంది మృతి చెందారు.

దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,81,817కి చేరింది. మొత్తం 53,712 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 88,138గా ఉంది.

ఇప్పటివరకు 1,91,117 మంది కరోనా నుంచి కోలుకోగా.. 2,562 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.